నవతెలంగాణ-హైదరాబాద్: రష్యానుంచి చమురు కొనుగోలు ఆపాలంటూ భారత్ పై ట్రంప్ సుంకాల మోత మోగిస్తున్న విషయం తెలిసిందే. ఇండియాకు చెందిన పలు రంగాలను టార్గెట్ చేస్తూ అనేక సుంకాలు విధించారు. హెచ్1బీ వీసా, ఫార్మా, సినిమా తదితర రంగాలతో పాటు పోస్టల్ సర్వీసులపై కూడా టారిప్‌లు విధించారు. దీంతో ఈఏడాది ఆగష్టు 22న భారత్ యూఎస్ కు అన్ని రకాల తపాలా సేవలు నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. తాజాగా అమెరికాకు పోస్టల్ సర్వీసులు పునర్ ప్రారంభంకానున్నాయి. ఈ నెల 15న ఆదేశానికి పోస్టల్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.ఈ మేరకు కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ మంగళవారం ఓ ప్రకటన జారీ చేసింది.
The post యూఎస్‌కు పోస్టల్ సర్వీసులు పునరుద్ధరణ appeared first on Navatelangana.