బుధవారం రాశి పలాలు (15-10-2025)

మేషం – ఆర్థిక ప్రయోజనాలు సున్నితమైన అంశములతోటి వివాదాస్పదమైన వ్యక్తులతోటి ముడిపడి ఉంటాయి. ఓర్పు నేర్పులతోనే కార్య సాధన అవుతుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.

వృషభం – ఊహలోకాలకు తెరదించి వాస్తవికత దృష్టితో విషయాలను పరిశీలించి అర్థం చేసుకుంటారు జమ ఖర్చులు ఆదాయ వ్యయాలు ప్రధాన ప్రస్తావన అంశాలు అవుతాయి.

మిథునం – పనులలో జాప్యం జరిగిన పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకారంగా ఉంటుంది. చాలా విషయాలలో ఒంటరి పోరాటం చేయవలసి వచ్చినప్పటికీ వెనుకడుగు వేయరు.

కర్కాటకం – మీ ప్రతిభకు గుర్తింపుగా సన్మానాలు జరుగుతాయి. వివాహ ఉద్యోగయత్నాల అనుకూలిస్తాయి. మీ పట్ల ఈర్ష్య ద్వేషాలు అధికమవుతాయి. వివాదాస్పద అంశాలను వదిలివేయడం మంచిది.

సింహం – నూతన పెట్టుబడులకు తగిన లాభం పొందుతారు. కుటుంబ సభ్యులతొ ఆనందంగా గడుపుతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు, అతిధుల నుండి శుభవార్తలు అందుకుంటారు.

కన్య – క్రయవిక్రయాలలో స్వల్ప లాభాలు పొందుతారు. నైపుణ్యంగా సమయస్ఫూర్తితో కట్టుదిట్టమైన కార్య ప్రణాళిక రూపొందించుకుంటారు. తద్వారా లాభపడతారు.

తుల – సంస్థను విస్తరింప చేయడానికి గాను మీరు చేసే ప్రయత్నాలు సానుకూల దిశలో ఉంటాయి. ప్రయాణాలను సాగిస్తారు. ఖర్చులు అధికంగా ఉంటాయి. వాహనాల విషయంలో జాగ్రత్త అవసరం.

వృశ్చికం – నూతన వ్యాపారాలను ప్రారంభించడానికి అనుకూల సమయమని భావిస్తారు. మధ్యవర్తిత్వాలు రాయబారాలు మేలు చేకూరుస్తాయి. వినోద కార్యక్రమాలకు ఇచ్చిన ప్రాముఖ్యతను వృత్తికి ఇవ్వరు.

ధనుస్సు – మాటమీద నిలబడే వ్యక్తిగా మంచి పేరును సంపాదిస్తారు. భవిష్యత్తు బంగారు బాటగా ఉంటుందనే ఆశావహ దృక్పథాన్ని కనబరుస్తారు. ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది.

మకరం – కొన్ని సందర్భాలలో దైవానుగ్రహం మీకు తోడు ఉందని రుజువు చేసే సంఘటనలు జరుగుతాయి. దూరప్రాంత ప్రయాణాలు చేయడానికి కావలసిన ధనాన్ని సమకూర్చుకుంటారు.

కుంభం – అమ్మకాలు కొనుగోలు అంశాలు ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. వాయిదా పడుతూ వస్తున్న వ్యక్తిగత పనులను పూర్తి చేసుకోగలుగుతారు. గతంలో మీరు చేసిన శ్రమ ఇప్పుడు అక్కరకు వస్తుంది.

మీనం – కొంత లౌక్యాన్ని కనపరచగలిగితే ప్రయోజనాలను మరింతగా పొందగలుగుతారు. శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. అంతరంగిక వ్యవహారాలలో కొన్ని రహస్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు.

 

Leave a Comment