గతంలో తమిళ బిగ్ బాస్ ఆరో సీజన్‌లో పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించిన ఆయేషా జీనత్ ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఐదో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడు పెట్టింది. పేరుకు తమిళ నటే అయినా తెలుగు బుల్లితెర ఆడియెన్స్ కు ఈ ముద్దుగుమ్మ బాగా పరిచయం. ‘సావిత్రి గారి అబ్బాయి’ సీరియల్‌తో తో మంచి గుర్తింపు తెచ్చుకుందీ అందాల తార. అలాగే కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ రెండో సీజన్‌లోనూ పార్టిసిపేట్ చేసింది. ఇక బిగ్ బాస్ తమిళ ఆరో సీజన్ లో తన ఆట, మాట తీరుతో అందరి దృష్టిని ఆకర్షించింది. అదే సమయంలో కాంట్రవర్సీ కంటెస్టెంట్ గానూ నిలిచింది. ఒకానొక సమయంలో నటుడు హోస్ట్ కమల్ హాసన్ నే ఎదిరించి మాట్లాడింది. ‘నన్ను తప్పుగా చిత్రీకరించొద్దు’ అని డైరెక్టుగా ఆయనతోనే చెప్పేసింది. అప్పట్లో ఇది బాగా వైరల్ అయింది. ఆయేషా పేరు బాగా వార్తల్లో నానింది. కాగా బిగ్ బాస్ తెలుగు హౌస్ లోకి అడుగు పెట్టిన అయేషా తన లవ్ బ్రేకప్, మాజీ ప్రియుడి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. గతంలో తాను తమిళ బిగ్ బాస్ షోలో 65 రోజుల పాటు ఉన్నానని కానీ బయట తన ప్రియుడు వేరే అమ్మాయితో రిలేషన్ మెంటైన్ చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది.
ఈ సందర్భంగా నాగార్జున ఆయేషాకు గ్రీన్ స్టోన్ ఇచ్చారు. నామినేషన్స్ లో ఈ పవర్ ఉపయోగించి, జరిగే తీరుని మార్చొచ్చు. ఎలా ఉపయోగించొచ్చు అనేది బిగ్ బాస్ చెప్తాడని నాగ్ క్లారిటీ ఇచ్చారు. అలానే హార్ట్ సింబల్ ఇచ్చి.. హౌసులోని ఎవరికైనా ఇచ్చి, కారణం కూడా చెప్పాలన్నారు. దీంతో ఆయేషా ఇమ్మాన్యుయేల్‌కి హార్ట్ సింబల్ ఇచ్చేసింది.
ఇవి కూడా చదవండి
అప్పుడు తమిళ బిగ్ బాస్.. ఇప్పుడు తెలుగులో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్..
Fearless. Fiery. Unstoppable.🔥#Aysha makes a wild card entry to light up Season 9 with her spark, strength, and storm! 🌪️💫#BiggBossFireStorm
Watch #BiggBossTelugu9 Mon–Fri 9:30 PM, Sat & Sun 9 PM on #StarMaa & stream 24/7 on #JioHotstar pic.twitter.com/kup36PPsXV
— Starmaa (@StarMaa) October 12, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.