Health Tips: అమేజింగ్.. రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏమవుతుందో తెలుసా..?

Health Tips: అమేజింగ్.. రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏమవుతుందో తెలుసా..?

ప్రతిరోజూ మన ఆహారంలో పండ్లు చేర్చుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. అలాంటి పోషకాల గనిలో ముఖ్యమైనది అరటిపండు. మీరు రోజుకు కేవలం రెండు అరటిపండ్లు తినడం మొదలుపెడితే.. మీ ఆరోగ్యంలో సానుకూలమైన, అద్భుతమైన మార్పులను గమనించవచ్చు. అరటిపండులో ఉండే అద్భుతమైన పోషకాలు మీ శరీరానికి ఎలా మేలు చేస్తాయో తెలుసుకుందాం.

 తక్షణ శక్తి వనరు

అరటిపండ్లు సహజమైన చక్కెరలు, ఫైబర్ యొక్క గొప్ప మిశ్రమం. ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. అందుకే జిమ్‌కి వెళ్లేవారు, అథ్లెట్లు వ్యాయామానికి ముందు, తర్వాత అరటిపండ్లు తినడానికి ఇష్టపడతారు. దీనివల్ల కండరాలకు శక్తి అంది. త్వరగా అలసట రాకుండా ఉంటుంది.

జీర్ణవ్యవస్థకు బలం

అరటిపండ్లు జీర్ణక్రియకు చాలా ప్రయోజనకరంగా పనిచేస్తాయి. వీటిలోని డైటరీ ఫైబర్ ఆహారం సులభంగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది. అంతేకాక వీటిలో ఉండే ప్రీబయోటిక్స్ ప్రేగులలో మంచి బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. మలబద్ధకం సమస్య ఉన్నవారికి అరటిపండ్లు తినడం చాలా ప్రభావవంతంగా పరిగణించబడుతుంది.

గుండెకు రక్షగా పొటాషియం

అరటిపండ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి చాలా అవసరమైన ఖనిజం. పొటాషియం శరీరంలో సోడియం ప్రభావాన్ని సమతుల్యం చేస్తుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. రోజుకు రెండు అరటిపండ్లు తినడం వల్ల గుండెపోటు ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు.

మానసిక స్థితి మెరుగుపడుతుంది

ఈ రోజుల్లో సర్వసాధారణంగా మారిన ఒత్తిడిని తగ్గించడంలో కూడా అరటిపండు సహాయపడుతుంది. అరటిపండ్లలో ట్రిప్టోఫాన్ అనే పదార్థం ఉంటుంది. ఈ ట్రిప్టోఫాన్ వల్ల శరీరం సెరోటోనిన్ అనే మంచి అనుభూతిని కలిగించే హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తుంది. సెరోటోనిన్ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. మంచి నిద్రను కూడా ప్రోత్సహిస్తుంది.

రక్తహీనత నివారణ

శరీరంలో ఐరన్ లోపం కారణంగా రక్తహీనత లేదా రక్త లోపం ఏర్పడుతుంది. అరటిపండ్లలో ఐరన్, విటమిన్ B6 పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు హిమోగ్లోబిన్ ఉత్పత్తికి సహాయపడడంతో పాటు రక్తహీనతను నివారించడంలో తోడ్పడతాయి.

బరువు తగ్గడంలో సహాయం

అరటిపండ్లలో కేలరీలు తక్కువగా, ఫైబర్ అధికంగా ఉంటుంది. వీటిని తినడం వల్ల ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. దీనివల్ల అతిగా తినకుండా నిరోధించవచ్చు. ఈ క్రమంలో బరువు తగ్గడానికి ఇది పరోక్షంగా ఉపయోగపడుతుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

[

Leave a Comment