రీచా ఘోష్ విధ్వంసం…ద‌క్ష‌ణాఫ్రికా టార్గెట్ ఎంతంటే..?

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: వరల్డ్ కప్‌లో రీచా ఘోష్‌ (94) ఒంటిచేత్తో జట్టుకు భారీ స్కోర్ అందించింది. 153కే ఏడు వికెట్లు పడిన దశలో ఏమాత్రం ఒత్తిడికి లోనవ్వకుండా అమన్‌జోత్ కౌర్ అండగా 51 పరుగులు, స్నేహ్ రానా(33)తో ఎనిమిదో వికెట్‌కు విలువైన 88 రన్స్ జోడించింది. ఆఖరి ఓవర్ వరకూ సాగిన ఆమె ఊచకోత కారణంగా భారత జట్టు 251 పరుగులు చేయగలిగింది.

వరల్డ్ కప్‌లో రెండు విజయాలతో జోరుమీదున్న భారత జట్టు మూడో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై తడబడినా ఆఖర్లో పుంజుకుంది. టెయిలెండర్లు రీచా ఘోష్ (94), స్నేహ్ రానా (33)ల అసాధారణ పోరాటంతో సఫారీ బౌలర్లు డీలా పడగా.. ప్రత్యర్థికి ఏకంగా 252 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. వైజాగ్ స్టేడియంలో భారత బ్యాటర్లు పేలవ షాట్లతో వికెట్లు సమర్పించుకున్నారు. స్మృతి మంధాన (23) ప్రతీకా రావల్(37) తర్వాత వచ్చిన జెమీమా రోడ్రిగ్స్(0) చోలే ట్రయాన్ వేసిన 21వ ఓవర్లో నాలుగో బంతికి స్వీప్ షాట్ ఆడబోయి డకౌట్‌ అయింది. దాంతో.. 92 వద్ద టీమిండియా నాలుగో వికెట్ పడింది.

The post రీచా ఘోష్ విధ్వంసం…ద‌క్ష‌ణాఫ్రికా టార్గెట్ ఎంతంటే..? appeared first on Navatelangana.

Leave a Comment