అమరావతి: మెడికల్ కాలేజీలను ఎక్కడా ప్రైవేటీకరణ చేయడం లేదని ఎపి మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. పిపిపి మోడల్ లో అభివృద్ధి చేయడం కోసం మరింత మెరుగైన సేవలు అందించడానికి ఈ ప్రయత్నం అని అన్నారు. ఈ సందర్భంగా పయ్యావుల మీడియాతో మాట్లాడుతూ.. చీప్ పాలిటిక్స్ చేయడం మాజీ సిఎం వైసిపి జగన్ మోహన్ రెడ్డి మార్చుకోవాలని సూచించారు. పిపిపి మోడల్ అనేది సరైన నిర్ణయం అని త్వరలో ఆర్ డిటి పై పాజిటివ్ వార్త వస్తుందని పయ్యావుల కేశవ్ తెలియజేశారు.
