Today Gold Rates: మహిళలకు గుడ్ న్యూస్.. నేడు తగ్గిన బంగారం ధరలు..

Today Gold Rates: మహిళలకు గుడ్ న్యూస్.. నేడు తగ్గిన బంగారం ధరలు..

దిశ, వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ మన దేశంలో గోల్డ్‌కి మరింత పాపులారిటీ ఎక్కువ. ఇక ఈ మధ్య కాలంలో బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒకరోజు రేట్లు తగ్గి కాస్త ఊరటనిస్తుంటే మరోరోజు పెరిగి అమ్మో అనిపిస్తున్నాయి. ఈ క్రమంలో గత వారం రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు నేడు స్వల్పంగా తగ్గాయి. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న రూ.98,050 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధర పై నేడు రూ.100 తగ్గి రూ.97,950 ఉంది. అలాగే నిన్న రూ.1,06,970 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధర పై నేడు రూ.110 తగ్గి రూ.1,06,860గా ఉంది. ఇక అటు వెండి ధర కిలో రూ.1,37,000గా ఉంది. కాగా దాదాపు రెండు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే ఉన్నాయి.

నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.97,950

24 క్యారెట్ల బంగారం ధర – రూ.1,06,860

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.97,950

24 క్యారెట్ల బంగారం ధర – రూ.1,06,860

Leave a Comment