Local Elections In AP: స్థానిక సంస్థల ఎన్నికలంటే అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి. అంతటా నెలకొన్న అభిప్రాయం ఇది. అయితే ఈ అభిప్రాయాన్ని తెచ్చింది మాత్రం వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీ. 2019 ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. అటు తర్వాత వచ్చిన అన్ని ఉప ఎన్నికల్లో ఆ పార్టీ గెలిచింది. ఆ ఊపుతో ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు తిరుగు ఉండకూడదని భావించింది. ఏకగ్రీవం చేసుకోవడం ఒక ఎత్తు.. ఆ ఏకగ్రీవం కోసం ప్రత్యర్థులను బెదిరించడం కూడా మరో ఎత్తు. అయితే ఈ బెదిరింపులు ఏ స్థాయికి వెళ్ళాయి అంటే చివరకు జడ్పిటిసి స్థానాలను సైతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవం చేస్తుందంటే.. ఏ స్థాయిలో వ్యవహరించిందో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు అనగానే.. ఏముంటుందిలే అంత వన్ సైడే కదా అని సామాన్యుడు మాట్లాడే రీతికి పరిస్థితి వచ్చింది. దీనికి ముమ్మాటికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కారణం. వాలంటీర్లను అడ్డం పెట్టుకొని, సంక్షేమ పథకాలను నిలిపివేస్తామని హెచ్చరించి మరి ఓట్లు వేయించుకున్నారు. కేసులతో పాటు దాడుల భయాన్ని చూపి ప్రత్యర్థులు నామినేషన్లు వెయ్యకుండా కట్టడి చేశారు. దానినే ముద్దుగా ఏకగ్రీవం, ప్రజామోదం పేర్లు పెట్టుకున్నారు.
* విపక్షాలకు సైతం పదవులు..
అయితే గతంలో ఈ పరిస్థితి లేదు. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలంటే స్థానిక పరిస్థితులకు అనుగుణంగా అభ్యర్థులు ఎన్నికయ్యేవారు. కానీ వార్ వన్ సైడ్ పేరిట సీన్ మార్చేసింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. 1999లో చంద్రబాబు ( Chandrababu) నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ గెలిచింది. అదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చాయి. ఆ సమయంలో అయితే ఉమ్మడి రాష్ట్రంలో చాలా జిల్లా పరిషత్ చైర్మన్ పదవులను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 2006లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో కొన్ని జిల్లా పరిషత్ స్థానాలను టిడిపి సొంతం చేసుకుంది. పెద్ద ఎత్తున ఎంపీపీలను సైతం గెలుచుకుంది. 2009లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 2013లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పాటు ఇతర పక్షాలు సైతం కొన్ని పదవులు దక్కించుకున్నాయి. 2014లో టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేదు. 2018లో పంచాయితీల పాలకవర్గాల పదవులు ముగిసాయి. అయితే అప్పటికే సాధారణ ఎన్నికలు సమీపించడంతో చంద్రబాబు సర్కార్ ఎన్నికల నిర్వహణకు మొగ్గు చూపలేదు.
* ప్రత్యర్థులకు స్థానం లేకుండా..
2019లో జగన్( Y S Jagan Mohan Reddy ) నేతృత్వంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. కోవిడ్ కారణంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేదు. అయితే ఎప్పుడైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రత్యర్థులను సైతం నామినేషన్లు వేయించలేదు. దీంతో ప్రాదేశిక ఎన్నికలను బహిష్కరించింది తెలుగుదేశం పార్టీ. సర్పంచ్ ఎన్నికల్లో సైతం గట్టి బెదిరింపులకు దిగింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. వాలంటీర్ల ద్వారా బెదిరింపులకు పాల్పడింది. ఓటు వేస్తేనే సంక్షేమ పథకం.. లేకుంటే మాత్రం లేదు అంటూ బహిరంగంగానే హెచ్చరికలు జారీ చేసింది. దాని ఫలితమే ఏకపక్ష విజయం. ఇప్పుడు తెలుగుదేశం కూటమి అధికారంలో ఉంది. నీవు నేర్పిన విద్య నీరజాక్ష అన్నట్టు ఇప్పుడు కూడా అధికార పార్టీదే పై చేయిగా నిలుస్తుంది. అంతకుమించి ఏమీ ఉండదు కూడా.2019