Buying gold with credit card: ప్రస్తుతం బంగారం ధరలు 1,10,000 వరకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. దీంతో చాలామంది ఆభరణాలు ధరించడానికి కాకుండా పెట్టుబడుల కోసం బంగారంను కొనుగోలు చేస్తున్నారు. అయితే బంగారం ధర రోజురోజుకు పెరుగుతుండడంతో వాటిపై పెట్టుబడులు పెట్టేందుకు అప్పులు చేస్తున్నారు. కొందరు క్రెడిట్ కార్డు పై బంగారం కొనుగోలు చేస్తున్నారు. అయితే క్రెడిట్ కార్డు పై బంగారం కొనుగోలు చేయడం అంటే అప్పు తీసుకొని కొనడమే. మరి ఇలా క్రెడిట్ కార్డు పై బంగారం కొనుగోలు చేస్తే లాభం ఉంటుందా? అసలు క్రెడిట్ కార్డు పై బంగారం కొనుగోలు చేయవచ్చా?
ఇంట్లో బంగారం ఉంటే ఆస్తి అన్నట్లే. బంగారం ఉంటే దాని విలువ పెరుగుతూ ఉంటుంది. అందుకే చాలామంది భూముల తోపాటు బంగారం కూడా కొనుగోలు చేస్తూ ఉంటారు. భారతదేశంలో ఉన్న చాలా మందికి బంగారం అవసరం తప్పనిసరిగా ఉంటుంది. అందువల్ల బంగారం ధర తగ్గే అవకాశం లేదు. ఈ క్రమంలో ఎంతో కొంత బంగారం కొనుగోలు చేయాలని అనుకుంటారు. అయితే బంగారం కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. చేతిలో అదనంగా డబ్బు ఉంటే మాత్రమే బంగారం కొనుగోలు చేయాలి. అప్పులు చేసే బంగారం కొనుగోలు చేయొద్దని ఆర్థిక నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా క్రెడిట్ కార్డు పై బంగారం అసలు కొనుగోలు చేయాలని పేర్కొంటున్నారు. ఒకవేళ క్రెడిట్ కార్డు పై బంగారం కొనుగోలు చేయాల్సి వస్తే ఏం చేయాలంటే?
పెట్టుబడి కోసం మాత్రమే కాకుండా వివాహాలు, శుభకార్యాల కోసం బంగారం కొనుగోలు చేయాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో చేతిలో డబ్బు లేకపోయినా బంగారం కొనాలి. అయితే క్రెడిట్ కార్డు పై బంగారం కొనుగోలు చేయాలని చాలామంది అనుకుంటారు. ఒకవేళ క్రెడిట్ కార్డు పై బంగారం కొనుగోలు చేస్తే ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి.
క్రెడిట్ కార్డు పై బంగారం కొనుగోలు చేసేవారు తిరిగి దాని మొత్తాన్ని చెల్లించే ప్రయత్నం చేయాలి. ఈఎంఐ ద్వారా బంగారం కొనుగోలు అస్సలు చేయొద్దు. ఎందుకంటే క్రెడిట్ కార్డు ద్వారా బంగారం కొనుగోలు చేస్తే కొందరు రివార్డ్స్ వస్తాయని అనుకుంటారు. 2023 సంవత్సరం నుంచి ఆర్బిఐ క్రెడిట్ కార్డు పై బంగారం కొనుగోలు చేస్తే ఎలాంటి రివార్డ్స్ ఇవ్వదని ప్రకటించింది. అందువల్ల క్రెడిట్ కార్డు పై బంగారం కొనుగోలు చేస్తే ఆ మొత్తాన్ని ఒకేసారి చెల్లించే ప్రయత్నం చేయాలి. ఒకవేళ మొత్తాన్ని చెల్లించే పరిస్థితి లేకపోతే వెంటనే ఈఎంఐ కన్వర్ట్ చేసుకోవచ్చు. ఈఎంఐ కన్వర్ట్ చేసుకున్న తర్వాత కొందరు మినిమం పేమెంట్ చేస్తూ ఉంటారు.. అలా ఎప్పటికీ చెల్లించొద్దు. ఎందుకంటే మిగిలిన మొత్తానికి అదనంగా వడ్డీ వేస్తారు. ఆ వడ్డీ భారం పెరిగిపోయి అప్పుల పాలు కూడా కావచ్చు. క్రెడిట్ కార్డు పై బంగారం కొనుగోలు చేస్తే రెండు లేదా మూడు శాతం అదనంగా చార్జీలు పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఇలాంటి సమయంలో బంగారం కొనుగోలు చేసినా ఫలితం ఉండదు.
[