నవతెలంగాణ-హైదరాబాద్: ఆఫ్ఘనిస్తాన్‌లో భూకంప మృతుల సంఖ్య 2,200ను దాటినట్లు అధికారులు గురువారం ప్రకటించారు. తూర్పు ఆప్ఘనిస్తాన్‌లో ఆదివారం అర్థరాత్రి శక్తివంతమైన భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.0 గా నమోదైంది.
భూకంపం ధాటికి పాకిస్తాన్ సరిహద్దులోని పర్వతప్రాంతమైన కునార్ ప్రావిన్స్‌లో మొత్తం 2,217మంది మరణించగా, సుమారు 4,000మంది గాయపడినట్లు తాలిబన్ ప్రభుత్వ డిప్యూటీ ప్రతినిధి హమ్దుల్లా ఫిత్రాత్ గురువారం ఎక్స్‌లో పేర్కొన్నారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని అన్నారు. మట్టి, రాళ్లతో కట్టిన ఇళ్లు కూలిపోవడంతో వందలాది మంది నిరాశ్రయులయ్యారని అన్నారు.
The post భూకంపంలో 2,200మంది చనిపోయారు:ఆఫ్ఘనిస్తాన్ appeared first on Navatelangana.