పవన్ కళ్యాణ్ కాలర్ పట్టుకొని నిలదీసిన యంగ్ హీరో.. సంచలనం రేపుతున్న వీడియో!

పవన్ కళ్యాణ్ కాలర్ పట్టుకొని  నిలదీసిన యంగ్ హీరో.. సంచలనం  రేపుతున్న వీడియో!

Pawan Kalyan OG: సోషల్ మీడియా లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఓజీ..ఓజీ(They Call Him OG). ఈ రెండు పదాలు తప్ప ఇంకేమి కనిపించడం లేదు. ఇప్పటి వరకు ఈ సినిమా నుండి విడుదలైన ప్రతీ ప్రమోషనల్ కంటెంట్ ఒక అను బాంబు లాగా పేలింది. రీసెంట్ గా పవన్ కళ్యాణ్(Deputy Cm Pawan Kalyan) పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన గ్లింప్స్ వీడియో కి కూడా సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ చిత్రం నుండి ఇంకేమి అప్డేట్ వస్తుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. ఇదంతా పక్కన పెడితే సోషల్ మీడియా లో ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన వీడియో ఇప్పుడు బాగా వైరల్ అయ్యింది. పవన్ కళ్యాణ్ ని ఒక యంగ్ హీరో షూటింగ్ సెట్స్ లో చొక్కా పట్టుకొని నిలదీయాల్సిన పరిస్థితి వచ్చిందట. పవర్ స్టార్ ని అది కూడా ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి చొక్కాని పట్టుకునేంత దమ్ము ఎవరికీ ఉంది అని మీరు అనుకోవచ్చు.

Also Read: ఘాటీ’ లో అల్లు అర్జున్.. ఫ్యాన్స్ కి ఊహించని ట్విస్ట్.. వీడియో వైరల్!

కానీ ఈ సంఘటన జరిగింది రియల్ లైఫ్ లో కాదు, రీల్ లైఫ్ లో. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ సినిమా లో ప్రముఖ నటుడు వెంకట్ ఒక కీలక పాత్ర పోషించాడు. వెంకట్ అంటే మీకు వెంటనే గుర్తు రాకపోవచ్చు, అన్నయ్య సినిమాలో చిరంజీవి కి ఇద్దరు తమ్ముళ్లు గా నటించిన వారిలో ఒకడు వెంకట్. అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పని చేసిన అనుభవం గురించి ఆయన రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్తూ ‘ఈ చిత్రం లో నేను ఒక సన్నివేశం లో పవన్ కళ్యాణ్ చొక్కా కాలర్ ని పట్టుకొని నిలదీయాలి. ఈ సన్నివేశం చేయడానికి నేను చాలా ఇబ్బంది పడ్డాను. ఎంతైనా అంత పెద్ద సూపర్ స్టార్ తో ఇలాంటి సన్నివేశాలు చేయడం సాధారణమైన విషయం కాదు కదా,కానీ పవన్ కళ్యాణ్ గారు నాకు ధైర్యం చెప్పి ఈ సన్నివేశాన్ని చేయించాడు’ అంటూ చెప్పుకొచ్చాడు.

ఈ సినిమా అభిమానులకు ప్రతీ ఫ్రేమ్ ఒక పండుగ లాగానే ఉంటుందని, థియేటర్ లో చూసే ఫ్యాన్స్ పరిస్థితి ఏమి అవుతుందో భయం వేస్తుంది అంటూ వెంకట్ మాట్లాడిన మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. డైరెక్టర్ సుజిత్ వదులుతున్న ప్రతీ కంటెంట్ కూడా ఈ సినిమా ఎంత గొప్పదో తెలియజేస్తుంది. ప్రమోషనల్ కంటెంట్ ఉన్నట్టుగానే సినిమా కూడా ఉంటే బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ షేక్ అవుతాయని, తెలుగు రాష్ట్రాల్లో అయితే ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డుని నెలకొల్పుతుందని అంటున్నారు. మరి సినిమా నిజంగా ఆ రేంజ్ లో ఉందో లేదో తెలియాలంటే మరో 20 రోజులు ఆగాల్సిందే.

 

Leave a Comment