తెలంగాణలో గతకొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలు వణికిపోతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి రాష్ట్రానికి వర్షం హెచ్చరికలు జారీ అయ్యాయి. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సెప్టెంబర్ 3 మధ్యాహ్నం ఒడిశా తీరం దాటి, ప్రస్తుతం అక్కడే స్థిరంగా ఉంది. ఈ అల్పపీడనం కారణంగా గాలులు సుడులు తిరుగుతూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలపైనా ప్రభావం చూపుతున్నాయి. ఈ అల్పపీడనం బలహీనపడుతుందా ? లేదా తిరిగి సముద్రంలోకి వస్తుందా ? అనే దానిపై ఇంకా స్పష్టత లేదు.
హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. రాబోయే నాలుగు రోజులు తెలంగాణలో పలు జిల్లాలకు వర్ష సూచన ఉంది. దీంతో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ప్రస్తుతం అల్పపీడనం సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి, నైరుతి దిశగా వంగి ఉందని తెలిపారు. రాబోయే 24 గంటల్లో ఇది ఉత్తర ఒడిశాను ఆనుకుని జార్ఖండ్, ఉత్తర ఛత్తీస్‌గఢ్ వైపు పయనించే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది.
నేడు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయన్నారు.
శుక్రవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మెదక్, కామారెడ్డి, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఈ వాతావరణ మార్పుల దృష్ట్యా.. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వర్షం కురిసే సమయంలో ఇళ్ల నుంచి బయటకు వెళ్లొద్దని సూచించారు. ఇక హైదరాబాద్ నగరంలో నేడు పొడి వాతావరణం ఉంటుందని చెప్పారు. ఉదయం పలు ప్రాంతాల్లో జల్లులు పడే ఛాన్స్ ఉందని వెల్లడించారు. నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
The post అల్పపీడనం ఎఫెక్ట్.. తెలంగాణలో భారీ వర్షాలు, హెచ్చరికలు జారీ appeared first on Visalaandhra.