అభాగ్యులకు అండగా రాంజీ

విశాలాంధ్ర – కడియం : అభాగ్యులకు అండగా నేనున్నానంటూ కడియం మండలం కడియపులంక ఉపసర్పంచ్ పాఠంశెట్టి వెంకట రామారావు (రాంజీ) మరోసారి మానవత్వం చాటుకున్నారు. పంచాయతీ పరిధి బుర్రిలంకకు చెందిన దేవగుప్త సత్యవతి నడవలేని పరిస్థితిలో ఉండడంతో స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న రాంజీ ఖర్చుకు వెనకాడకుండా సౌకర్యవంతమైన వీల్ చైర్ ను కొనుగోలు చేసి స్థానిక నాయకుల సమక్షంలో తన క్యాంపు కార్యాలయం వద్ద సత్యవతి కుటుంబ సభ్యుల మధ్య ఆమెకు అందజేశారు. తన బాధను అర్థం చేసుకున్న రాంజీ వీల్ చైర్ సమకూర్చడం తనకెంతో ఆనందంగా ఉందని సత్యవతి అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ వార్డు సభ్యుడు కట్టా శివ, జిల్లా పార్లమెంటరీ టిడిపి సెక్రెటరీ బండి నాగమణి, పట్టా బాలు, వారా నగేష్ తదితరులు పాల్గొన్నారు.

The post అభాగ్యులకు అండగా రాంజీ appeared first on Visalaandhra.

Leave a Comment