Most Talked Indian Personalities: మోడీ తర్వాత ఎన్టీఆరే.. ఒక్కసారి గా జూనియర్ కు ఇంతటి ఫాలోయింగా?

Most Talked Indian Personalities: అప్పట్లో తెలంగాణ రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలకు ముందు కేంద్ర హోంశాఖ మంత్రి హైదరాబాద్ వచ్చారు. పార్టీకి సంబంధించిన మీటింగ్ నిర్వహించారు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ను కలుసుకున్నారు. ఆయనతో చాలాసేపు మాట్లాడారు. అప్పట్లో ఈ చర్చ సంచలనం కలిగించింది. ఒకానొక దశలో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం చేస్తారని వార్తలు కూడా వచ్చాయి. కానీ అవి అంతటితోనే ఆగిపోయాయి. అయితే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఏకంగా నేషనల్ వైడ్ సెలబ్రిటీ అయిపోయారు. అంతేకాదు నరేంద్ర మోడీ తర్వాత స్థానాన్ని ఆక్రమించారు.

Also Read: ఇండియాను చూసేందుకు వస్తే..ఇలా చేస్తారా? అసలు మీరు భారతీయులేనా?

ఇటీవల ఓ ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ మీద తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో.. ఆయన గురించి చర్చ జరిగింది. ఒకానొక దశలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసి.. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు.. ఆ వ్యవహారం వల్ల జూనియర్ ఎన్టీఆర్ గురించి తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. వైసిపి ఈ గొడవ మీద పెట్రోల్ పోసింది. ఫలితంగా కొద్దిరోజులపాటు మీడియాలో చర్చనీయాంశంగా మారింది. జాతీయ మీడియా సంస్థలు ఈ వార్తకు విపరీతమైన ప్రయారిటీ ఇచ్చాయి. ఎందుకంటే అప్పటికే వార్ సినిమా విడుదలైన నేపథ్యంలో.. నేషనల్ మీడియా ఎక్కువగా ఈ విషయం మీద ఫోకస్ చేసింది.

జరిగిన గొడవను పక్కనపెడితే ఈ వ్యవహారం వల్ల జూనియర్ ఎన్టీఆర్ ఒకసారిగా నేషనల్ లెవెల్ లో సెలబ్రిటీ అయిపోయారు. ట్విట్టర్ వేదికగా ఆగస్టు నెలలో మనదేశంలో అత్యధికంగా చర్చించుకున్న ప్రముఖుల జాబితాలో నరేంద్ర మోడీ ఫస్ట్ ప్లేస్ లో నిలిచారు. ఇక జూలైలో మూడో స్థానంలో ఉన్న జూనియర్ ఎన్టీఆర్.. ఆగస్టు నెలలో రెండవ స్థానానికి వచ్చారు. ఆగస్టు ఒకటి నుంచి 31 వరకు ఎక్స్ సమాచారాన్ని.. దేశంలో ఉన్న యూజర్ల పోస్టులను లెక్కలోకి తీసుకుంటే ఈ ర్యాంకులు ఇచ్చినట్టు తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ తర్వాత తమిళ హీరో విజయ్.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. టీమిండియా ఆటగాడు గిల్.. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ.. స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ.. టాలీవుడ్ నటుడు మహేష్ బాబు.. లెజెండరీ క్రికెటర్ ధోని.. తమిళ దిగ్గజ కథానాయకుడు రజనీకాంత్ అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఏకంగా ట్విట్టర్లో నరేంద్ర మోడీ తర్వాత స్థానంలో నిలవడం పట్ల ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవల ఓ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తీవ్రంగా స్పందించారు.. సామాజిక మాధ్యమాలలో ఒక యుద్ధాన్ని నడిపారు. జూనియర్ ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యల చేసిన వారిని ఒక ఆట ఆడుకున్నారు. పైగా ఆ సమయంలో వార్ సినిమా కూడా విడుదల కావడంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు రెచ్చిపోయారు. అందువల్లే ఆయన ట్విట్టర్లో సెకండ్ స్థానాన్ని దక్కించుకున్నారు.

Leave a Comment