సినిమాను చంపేస్తోంది ఎవరు..? హీరోలా, దర్శకులా, ప్రొడ్యూసర్సా, ప్రేక్షకులా?

సినిమాను చంపేస్తోంది ఎవరు..? హీరోలా, దర్శకులా, ప్రొడ్యూసర్సా, ప్రేక్షకులా?

Telugu Film Industry: తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు దుబ్బరమైన పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఒక సినిమా రిలీజ్ అయితే ఆ సినిమా బాగున్నప్పటికి సక్సెస్ ని సాధిస్తుందా లేదా అనే అనుమానాలైతే వ్యక్తం అవుతున్నాయి. ఒకప్పుడు కంటెంట్ బాగుండి సినిమా ఎగ్జిక్యూషన్ అద్భుతంగా ఉంటే సినిమా సూపర్ సక్సెస్ అయ్యేది. కానీ ఇప్పుడు అవన్నీ ఉన్నా కూడా థియేటర్ కి ప్రేక్షకుడు రావడం లేదు. కాబట్టి ఆ సినిమాని ప్లాప్ గానే పరిగణించాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది…అలాంటి మార్పుకు కారణం ఎవరు లేవరు అనే దాని మీదనే ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న పెద్దలందరు కలిసి ఒక మీటింగ్ అయితే అరెంజ్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. మరి దీనికి చెక్ పెట్టకపోతే మాత్రం ఈ ప్రాబ్లం ను ఎదుర్కొంటూ చాలామంది చిన్న నిర్మాతలు వల్ల ఉనికిని కోల్పోవల్సిన పరిస్థితి అయితే ఏర్పడనుంది… నిజానికి పెరుగుతున్న బడ్జెట్ కారణంగా సినిమా టికెట్ రేట్లు పెంచడం వల్ల ప్రేక్షకుడు థియేటర్ కి రావడం లేదు. ఇది మొదటి ప్రాబ్లం అయితే, సినిమా రిలీజ్ అయిన వారం రోజుల్లోపే ఓటిటిలోకి వచ్చేస్తోంది. కాబట్టి ప్రతి ప్రేక్షకుడు ఓటిటి లో సినిమాను చూస్తే సరిపోతోంది. అన్ని డబ్బులు పెట్టి సినిమా చూడడం ఎందుకు అనే ఒక ధోరణిలో ఉన్నాడు…

Also Read: పవన్ కళ్యాణ్ విషయంలో సుజీత్ ఆ ఒక్క తప్పు చేశాడా..?

కాబట్టి దీనిని రెండో కారణంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రెండు కారణాలకు చెక్ పెట్టినట్లయితే మాత్రం ప్రేక్షకులు థియేటర్ కి వచ్చి మరి సినిమాని చూస్తారు. టికెట్ల రేటు తగ్గించాలంటే హీరోలు, దర్శకులు వాళ్ళ రెమ్యూనరేషన్ ను తగ్గించుకొని లో బడ్జెట్లో సినిమాలను చేయాల్సిన అవసరం అయితే ఉంది.

ఇక ఓటిటి విషయానికి వస్తే నిర్మాతలు వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండకుండా నిర్మాతలు చెప్పిన డేట్ నే ఫైనల్ చేసి ఓటిటి వాళ్లు సినిమాల్ని రిలీజ్ చేసే విధంగా అయితే నిర్ణయాలు తీసుకోవాలి. ఓటిటి సంస్థనే ఒక సినిమాని ఎప్పుడు రిలీజ్ చేయాలి ఎప్పుడు ఓటిటికి రిలీజ్ చేసుకోవాలి అని ఒక డిమాండ్ తీసుకొచ్చి వాటి ఇష్టం వచ్చినట్టుగా సినిమాని చంపేస్తున్నారు…

మరి వీటన్నింటికి చెక్ పెట్టాలంటే మాత్రం మొదటగా ఈ రెండు కారణాలను ఎదిరించి ముందుకు నడిస్తేనే సినిమా ఇండస్ట్రీ ఇంతకుముందులా సాఫీగా సాగుతోంది. లేకపోతే మాత్రం సినిమా ఇండస్ట్రీ దారుణమైన పరిస్థితిని ఎదుర్కోవడమే కాకుండా చిన్న నిర్మాతలు వాళ్ళ ఆస్తులు నమ్ముకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడనుంది…

Leave a Comment