Turmeric Milk: కంటినిండా నిద్ర కోసం

ఈ ఆధునిక జీవితశైలిలో చాలా మంది నిద్రకు దూరం అవుతున్నారు(Turmeric Milk). ఈ సమస్యకి కారణాలు కూడా చాలానే ఉన్నాయి.

Turmeric Milk: కంటినిండా నిద్ర కోసం

Health benefits of drinking turmeric milk daily

Updated On : September 1, 2025 / 5:34 PM IST

Turmeric Milk: ఈ ఆధునిక జీవితశైలిలో చాలా మంది నిద్రకు దూరం అవుతున్నారు. దీనికి, చాలా కారణాలే ఉన్నాయి. ఒత్తిడి, సమయపాలన లేని తిండి, ఆహారపు అలవాట్లు, మారుతున్న జీవన శైలి. ఇలా చాలా రకాల కారణాల వల్ల నిద్ర లేమి సమస్యలు తలెత్తుతున్నాయి. దీర్ఘకాలంలో దీని తీవ్రత ఆరోగ్యంపై ఎక్కువగా ఉండే ప్రమాదం ఉంది. కాబట్టి, మన జీవనశైలీలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం వల్ల గాఢమైన నిద్రను(Turmeric Milk) పెంచుకునే అవకాశం ఉంది. అందులో ఇప్పుడు చెప్పుకోబోయే పానీయం ప్రధాన పాత్ర పోషిస్తుంది. మరి ఆ పానీయం ఏంటి అనేది ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

Health Tips: కళ్ళు తిరగడం దేనికి సంకేతం.. ప్రమాద హెచ్చరిక.. జాగ్రత్తగా ఉండాల్సిన విషయం

పసుపు పాలు:
వేడి పాలలో పసుపు పొడి కలుపుకోవాలి. దీనిలో కొంత మిరియాల పొడి, తేనె/ దాల్చిన చెక్క కూడా కలపవచ్చు. ఈ పాలు శరీరాన్ని విశ్రాంతి పరిచి సహజమైన నిద్ర పడుతుంది.

పసుపు పాలులో ఉండే ముఖ్యమైన గుణాలు:

  • పసుపు (Turmeric): యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్
  • పాలు: ట్రిప్టోఫాన్, కాల్షియం, ప్రోటీన్లు
  • దాల్చిన చెక్క: రక్తప్రసరణకు మేలు
  • తేనె: మెదడుకు విశ్రాంతిని కలిగించే సహజ గుణం

పసుపు పాలుతో లభించే ముఖ్య నిద్ర ప్రయోజనాలు:

1.ఘాడమైన నిద్రను ప్రేరేపిస్తుంది:
పాలలో ట్రిప్టోఫాన్ అనే యామినో యాసిడ్ ఉంటుంది. ఇది మెదడులో సిరోటోనిన్, మెలటోనిన్ హార్మోన్లను ఉత్పత్తి చేసేందుకు సహాయపడుతుంది. ఇది నిద్ర రాకను సహజంగా ప్రేరేపిస్తుంది. దీనివల్ల ఘాడమైన నిద్ర పడుతుంది.

2.ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది:
పసుపులో ఉండే కర్క్యుమిన్ మెదడులో ఒత్తిడిని తగ్గించే హార్మోన్లను విడుదల అయ్యేలా చేస్తుంది . ఇది మానసిక ప్రశాంతను ఏర్పరిచి నిద్రకు ఉపక్రమించే స్థితిని కలుగజేస్తుంది.

3.శరీరంలోని వాపులను తగ్గిస్తుంది:
వేడి పాలు, పసుపు కలయిక శరీరంలోని వాపులను, కండరాల నొప్పులు తగ్గించడంతో సహాయపడుతుంది. కాబట్టి, శరీరానికి ప్రశాంతత ఏర్పడి మంచి నిద్ర పడుతుంది.

4.జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది:
రాత్రిపూట పసుపు కలిపినా పాలు తాగడం వల్ల అజీర్తి, బ్లోటింగ్, గ్యాస్ వంటి సమస్యలు తగ్గిపోతాయి. కడుపు లైట్‌గా మారుతుంది. దీని వల్ల ఎలాంటి ఆటంకం లేకుండా మంచి నిద్ర పడుతుంది.

5.రోగనిరోధక శక్తిని పెంచుతుంది:
పసుపు పాలులో యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు శరీర రక్షణ వ్యవస్థను బలపరుస్తాయి. ఆరోగ్యంగా నిద్రించడం ద్వారా శరీరం శీఘ్రంగా పునరుత్పత్తి చెందుతుంది.

[

Leave a Comment