Srisailam Project : శ్రీశైలం ప్రాజెక్టుకు స్థిరంగా కొనసాగుతున్న వరద

శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. ఎగువన ఉన్న జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి నీరు భారీగా వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్టులో నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అధికారులు ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయం నీటిమట్టం 882.60 అడుగులు గరిష్ట నీటిమట్టం 885 అడుగులు కాగా నీటి నిల్వ 202.50 టీఎంసీలు (గరిష్ట నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలుగా ఉంది, ఇన్ ఫ్లో వరద ప్రవాహం సుమారు 3 లక్షలకు పైగా క్యూసెక్కులుగా ఉంది. అవుట్ ఫ్లో (బయటికి విడుదల): సుమారు 3,65,282 క్యూసెక్కులుగా కాగా, గేట్ల ద్వారా 10 గేట్లను ఎత్తి నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులోకి నిరంతరాయంగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో, దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

Leave a Comment