RGV fires on Jagapathi Babu: ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలందరు కొన్ని షో లకు హోస్టులుగా వ్యవహరిస్తూ ముందుకు సాగుతున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే జగపతి బాబు లాంటి నటుడు సైతం ఇప్పుడు సినిమాలతో పాటు గా జీ చానెల్ లో వస్తున్న ‘జయమ్మూ నిశ్చయమ్మురా’ అనే షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. అయితే ఈ షో ని టాప్ లెవెల్ కి తీసుకెళ్లే ప్రయత్నంలో ఆయన ముందుకు దూసుకెళ్తున్నట్టుగా తెలుస్తోంది. ఇంతకుముందు టెలికాస్ట్ అయిన మూడు ఎపిసోడ్లతో మంచి పాపులారిటీ ని సంపాదించుకున్న ఈ షో లో నాల్గవ ఎపిసోడ్ కోసం సందీప్ రెడ్డివంగ – ఆర్జీవి ఇద్దరు రావడం విశేషం… ఇక ఎపిసోడ్ తో ఈ షో మరింత ముందుకు దూసుకెళ్లబోతున్నట్టుగా తెలుస్తోంది… వీళ్ళిద్దరూ పాల్గొన్న ప్రోమో అయితే రిలీజ్ అయింది. ఇక ఈ ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది. మరి దానికి తగ్గట్టుగానే ఈ ప్రోమోలో వర్మ మాట్లాడిన మాటలు సైతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇక దాంతో పాటుగా సందీప్ కి సంబంధించిన కొన్ని విషయాలను కూడా వర్మ చెప్పినట్టుగా తెలుస్తోంది…ఇక దాంతో సందీప్ రెడ్డి వంగకి ఆర్జీవి అంటే చాలా ఇష్టమని గతంలో చాలా సందర్భాల్లో తెలియజేశారు. అందుకే వీళ్ళిద్దరిని కలిపి షో కి పిలిస్తే ఎపిసోడ్ చాలా రసవత్తరంగా ఉంటుందనే ఉద్దేశ్యంతో ఈ షోలోకి అయితే వాళ్ళిద్దరిని ఇన్వైట్ చేశారు. మొత్తానికైతే ఈ షో చాలా మంచి వ్యూయర్షిప్ ను సంపాదించుకోబోతుందనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది.
ఈ ఒక్క ఎపిసోడ్ తో ఈ షోకి చాలా మంచి పాపులారిటీ రాబోతోంది అనేది కూడా తెలుస్తోంది. మొత్తానికి అయితే వర్మ పెద్దగా సినిమాలు ఏమీ చేయడం లేదు. సందీప్ రెడ్డివంగ మాత్రం ప్రభాస్ తో స్పిరిట్ సినిమా చేస్తున్నాడు.
మరి వీళ్ళిద్దరినీ కలిపి ఈ షోలో కూర్చోబెట్టి ఎలా ప్రేక్షకుడిని ఎంటర్టైన్ చేయబోతున్నారు అనేది కూడా తెలియాల్సి ఉంది. నిజానికి వీళ్ళిద్దరికీ చాలా కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఉంది. వాళ్ళను అభిమానించే ఫ్యాన్స్ ఉండడం చాలా గ్రేట్ అనే చెప్పాలి. వీళ్ళిద్దరూ కూడా టాలెంటెడ్ డైరెక్టర్లు కావడం వల్ల ఈ సినిమాలతో ఇండస్ట్రీ షేక్ చేశారు.
మొత్తానికైతే సందీప్ రెడ్డివంగ కావడంతో వీళ్ళిద్దరికీ మంచి గుర్తింపైతే లభించింది. మరి ఈ షోలో మరిన్ని విషయాలను పంచుకున్నట్టుగా తెలుస్తోంది. అవి ఏంటి అనేది తెలియాలంటే మాత్రం ఈ షో టెలికాస్ట్ అయ్యేదాకా వెయిట్ చేయాల్సిందే…