Donald Trump: కాలు తీసేయాల్సి రావొచ్చు..ట్రంప్ హెల్త్‌పై డాక్టర్ సంచలనం – Telugu News | Trump’s alarming health condition can lead to ‘amputation’ doctor issues urgent warning video – World Videos in Telugu

అయితే, ఈ నేపథ్యంలో.. వైట్‌హౌస్‌లో మనవడు, మనవరాలితో కలసి ఉన్న ట్రంప్ ఫొటోలు బయటకు రావటంతో.. రూమర్లకు తెరపడినా.. అవన్నీ పాతఫోటోలనే అంశం తెరపైకి వచ్చింది. ఇక.. ట్రంప్‌ అనారోగ్యం ఏమిటనే అంశంపైనా అమెరికా వ్యాప్తంగా జోరుగా చర్చ సాగుతోంది. మెడికల్ పరిభాషలో CVIగా చెప్పే క్రానిక్‌ వీనస్ ఇన్ సఫిషియన్సీ అనే సమస్యతో అధ్యక్షుడు బాధపడుతున్నారనే వార్తలు వస్తున్నాయి. ఈ సమస్యపై అమెరికన్ డాక్టర్ మిమీ క్వాంగ్ స్పందించారు.సిరల్లోని చిన్న కవాటాలు రక్తాన్ని గుండె వైపు పంపడంలో సరిగా పని చేయకపోవడం వల్ల ఈ సమస్య తలెత్తుతుందని… ఫలితంగా రక్తం కాళ్లలో పేరుకుపోయి వాపు వస్తుందని తెలిపారు. దాని వల్లే ఇప్పుడు కూడా చేతిపై గాయం అయి ఉండొచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. ఓ హెల్త్ సెంటర్ బ్లాగ్ లో ఆమె స్పందిస్తూ.. అమెరికాలోని ప్రతి ముగ్గురిలో ఒకరికి ఈ సమస్య ఉందని, సమస్య ఎంత తీవ్రంగా ఉందనే దానిని బట్టి పరిణామాలు ఉంటాయని ఆమె వివరించారు. ఈ సమస్య ఉన్నవారిలో కాళ్ల వాపు ఉంటుందని, సమస్య తీవ్రమయ్యే కొద్దీ కాలి చర్మం మందంగా మారి, పొడిబారి, మంటలు పుడతాయని తెలిపారు. పరిస్థితి ఇంకా దిగజారితే కాలికి మానని గాయమయ్యే ప్రమాదం ఉందని, అదే పరిస్థితి గనుక వస్తే.. కాలు తీసేయటం తప్ప మరో మార్గం లేదని తెలిపారు. కాగా, ట్రంప్ ఆరోగ్యంపై వస్తున్న వదంతుల్లో వాస్తవం లేదని, వైట్ హౌస్ ప్రకటించింది. రోజూ వందలాది మందితో అధ్యక్షుడు షేక్ హ్యాండ్ ఇవ్వడం వల్ల చేతి మీద కాస్త కొంచెం ఒత్తిడిపడిందని.. లోపల పెద్ద సమస్య లేదని తెలిపింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వీధి శునకాలపై ప్రేమ.. చెంప దెబ్బలకూ వెనకాడని మహిళ

పాపకు కానుకగా బుర్జ్‌ ఖలీఫాలో ఫ్లాట్‌! వైరల్‌గా వీడియో

క్యాంటిన్‌ టీ తాగి.. కుప్పకూలిన మెడికో

ఐదేళ్ల క్రితం బహ్రెయిన్‌లో మృతి.. ఇప్పుడు అంత్యక్రియలు

దెయ్యం పట్టిందని భర్తను చితక్కొట్టిన భార్య.. ఆ తరువాత సీన్‌ ఇదే

Leave a Comment