కవిత కామెంట్స్ తెలంగాణ రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించింది. సొంత పార్టీ నుంచే ఆమె విమర్శలు ఎదుర్కుంటుంది. ఆమె వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు సైతం స్పందించారు. కాళేశ్వరంలో కరప్షన్ జరిగిందని కేసీఆర్ బిడ్డే చెబుతుందని.. సీబీఐ దర్యాప్తులో అసలు నిజాలు వెలుగులోకి వస్తాయని అన్నారు. కానీ కవిత రాజకీయాల కోసమే రేవంత్ పేరు ప్రస్తావించారని మండిపడ్డారు. బీఆర్ఎస్‌తో కాంగ్రెస్‌కు ఎటువంటి సంబంధం లేదని.. తమ ప్రభుత్వంపై అనవసరంగా బురద జల్లడం సరికాదన్నారు.
