BSNL: అదిరే ఆఫర్ అంటే ఇదీ.. అతి తక్కువ ధరకే డైలీ 3GB డేటా.. జియో, ఎయిర్‌టెల్‌కు బీఎస్ఎన్ఎల్ షాక్.. – Telugu News | BSNL’s Double Dhamaka: Rs 299 Offers 3GB Daily Data and Calling Benefits

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్.. రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి పోటీ ఇస్తోంది. అదిరే ఆఫర్లతో కస్టమర్లను అట్రాక్ట్ చేస్తోంది. ఇటీవల బీఎస్‌ఎన్‌ఎల్ తన కస్టమర్ల కోసం ప్రత్యేకమైన రూ. 299 ప్లాన్‌ను తిరిగి ప్రవేశపెట్టింది. గతంలో ఈ ప్లాన్‌లో రోజుకు 1.5 జీబీ డేటా మాత్రమే లభించేది.. కానీ ఇప్పుడు దాని ప్రయోజనాలు రెట్టింపు అయ్యాయి. దీనితో ఈ ప్లాన్ ఇప్పుడు రోజుకు 3 జీబీ డేటాను అందిస్తోంది.

డబుల్ ధమాకా ప్లాన్..

బీఎస్‌ఎన్‌ఎల్ తన అధికారిక సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్‌లో ఈ ప్లాన్ గురించి ప్రకటించింది. ఈ కొత్త ఆఫర్‌తో రూ. 299 రీఛార్జ్ ప్యాక్‌లో వినియోగదారులు 30 రోజుల పాటు రోజుకు 3 జీబీ డేటాను పొందుతారు. దీని ప్రకారం, ఒక నెలలో మొత్తం 90 జీబీ డేటా లభిస్తుంది. సాధారణంగా చాలా ప్లాన్‌లు 28 రోజుల వ్యాలిడిటీని అందిస్తాయి. కానీ ఈ ప్యాక్ పూర్తి 30 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. డేటాతో పాటు ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు కూడా లభిస్తాయి. ఇంత తక్కువ ధరలో ఈ స్థాయిలో ప్రయోజనాలను జియో లేదా ఎయిర్‌టెల్ వంటి ప్రైవేట్ సంస్థలు అందించలేకపోతున్నాయి. అందుకే ధరల పెరుగుదల తర్వాత చౌకైన ప్లాన్‌ల కోసం చూస్తున్న వినియోగదారులకు ఈ ప్లాన్ ఒక మంచి ఎంపికగా నిలుస్తుంది.

మరో చౌకైన ప్లాన్

రూ. 299 ప్లాన్ మీకు ఖరీదైనదిగా అనిపిస్తే, బీఎస్‌ఎన్‌ఎల్ మరొక చౌకైన ప్లాన్‌ను కూడా అందిస్తోంది. రూ. 199 ప్లాన్‌తో మీరు 30 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 2 జీబీ డేటా, అన్ లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనాలను పొందవచ్చు. ఈ ప్లాన్‌లో రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు కూడా అందుబాటులో ఉంటాయి. రూ. 200 లోపు ధరలో ఎక్కువ డేటా, అపరిమిత కాలింగ్‌ను కోరుకునే వినియోగదారులకు ఈ ప్లాన్ బెస్ట్ అని చెప్పొచ్చు. బీఎస్‌ఎన్‌ఎల్ ఈ రెండు ప్లాన్‌లతో ప్రైవేట్ టెలికాం కంపెనీలకు గట్టి పోటీ ఇస్తూ తన వినియోగదారులను పెంచుకోవాలని చూస్తోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Comment