Bigg Boss 9 Telugu Celebrities : బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ‘బిగ్ బాస్ 9′(Bigg Boss 9 Telugu) వచ్చే ఆదివారం రోజున గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ ద్వారా ప్రారంభం కానుంది. ఎన్నడూ లేని విధంగా ఈ సీజన్ పై ప్రేక్షకుల్లో అంచనాలు భారీ గా ఏర్పడ్డాయి. కారణం సామాన్యులను బిగ్ బాస్ హౌస్ లోపలకు పంపే ప్రక్రియ ఉంది కాబట్టే. ఎన్నో వేల దరఖాస్తుల నుండి కేవలం 15 మందిని మాత్రమే ఎంచుకొని వాళ్లకు వివిధ రకాల తాసుకులను అగ్నిపరీక్ష షో ద్వారా నిర్వహిస్తున్నారు. వీటికి సంబంధించిన ఎపిసోడ్స్ గత కొద్దిరోజులుగా జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. వీరిలో హౌస్ లోకి అడుగుపెట్టబోయే 5 మంది కంటెస్టెంట్స్ ఎవరు అనేది ఆడియన్స్ కి ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. వీళ్ళ సంగతి పక్కన పెడితే, గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టబోతున్న 13 మంది సెలబ్రిటీలు ఎవరు? అనేది ఇప్పుడు వివరంగా చూద్దాము.
అగ్నిపరీక్ష షో ద్వారా శ్రేయా,దమ్ము శ్రీజ మరియు పడాల పవన్ కళ్యాణ్ లను ఆడియన్స్ ఓటింగ్ తో సంబంధం లేకుండా నేరుగా జడ్జీల ద్వారా హౌస్ లోకి పంపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని లేటెస్ట్ గా వినిపిస్తున్న టాస్క్. ఆ తర్వాత ఆడియన్స్ ఓటింగ్ ద్వారా మాస్క్ మ్యాన్ హరీష్, మర్యాద మనీష్ లేదా ప్రియా శెట్టి లను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక సెలబ్రిటీల విషయానికి వస్తే అనేక సీరియల్స్ లో హీరో గా, విలన్ గా, క్యారక్టర్ ఆర్టిస్టుగా నటించి ఆడియన్స్ కి బాగా దగ్గరైన భరణి ఈ షోలో కంటెస్టెంట్ గా అడుగుపెట్టబోతున్నాడు అట. అదే విధంగా కమెడియన్ సుమన్ శెట్టి, జబర్దస్త్ కమెడియన్ ఇమ్మానుయేల్, ఆశా షైనీ, తనూజ గౌడ, సంజన గిల్రాని, డెబ్జానీ, రీతూ చౌదరి వంటి వారు కూడా హౌస్ లోకి అడుగుపెట్టబోతున్నారట.
పైన చెప్పిన వాళ్లందరితో అగ్రీమెంట్స్ కూడా పూర్తి అయ్యినట్టు తెలుస్తుంది. వీళ్ళతో పాటు రీసెంట్ గానే మంచి పాపులారిటీ ని సంపాదించుకొని సోషల్ మీడియా లో వివాదాస్పదంగా మారిన అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య మోక్ష, జానీ మాస్టర్ అరెస్ట్ విషయం లో హైలైట్ అయిన శ్రేష్టి వర్మ వంటి వారు కూడా రాబోతున్నారు. అదే విధంగా బిగ్ బాస్ టాప్ 5 కంటెస్టెంట్ గా నిల్చిన ప్రియాంక జైన్ కాబోయే భర్త శివ్, గుప్పేదేంత సీరియల్ హీరో ముకేశ్ గౌడ కూడా ఈ సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొనబోతున్నట్టు సమాచారం. మరో ఆశ్చర్యకరమైన వార్త ఏమిటంటే ప్రముఖ యంగ్ హీరో రాజ్ తరుణ్ కూడా రీసెంట్ గానే బిగ్ బాస్ సంప్రదించారట. ఆయన వస్తున్నాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. మరో రెండు రోజుల్లో ఈ లిస్ట్ పై ఇంకా కాస్త క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.