Bigg Boss 9 telugu Agni Pariksha : టెలివిజన్ రంగంలో గత 8 సంవత్సరాలుగా బిగ్ బాస్ షో తనదైన రీతిలో సత్తా చాటుతూ ముందుకు సాగుతోంది. ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా 8 సీజన్లను కంప్లీట్ చేసుకున్న ఈ షో ఇప్పుడు మరింత రెట్టింపు ఉత్సాహంతో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటోంది. ఇక ఇప్పటికే ఈ షోలో సామాన్యులను సైతం భాగం చేయాలనే ఉద్దేశ్యంతో అగ్నిపరీక్ష అనే ఒక షోని కండక్ట్ చేస్తున్నారు. ఇక ఇందులో 45 మంది పాల్గొంటే అందరు వచ్చి 15 మందిని సెలెక్ట్ చేసి దాంట్లో నుంచి ఐదు మందిని మాత్రమే సెలెక్ట్ చేసి బిగ్ బాస్ హౌస్ లోకి పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు.
మరి ఇలాంటి సందర్భంలోనే అగ్గి పరీక్షలో జడ్జెస్ చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు అంటూ ఈ షో ను చూసే ప్రేక్షకులు సైతం వాళ్ల మీద కొంతవరకు ఫైర్ అవుతున్నారు. మరి ఈ విషయం మీదనే నవదీప్ క్లారిటీ ఇస్తూ ఒక వీడియోని కూడా షేర్ చేశాడు. అగ్ని పరీక్ష లో జడ్జెస్ డిఫరెంట్ గా బిహేవ్ చేయడానికి గల కారణం ఏంటంటే బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చే సెలబ్రిటీలందరికి తెలిసి ఉంటారు.
కాబట్టి వాళ్లకు ఓటింగ్స్ అయితే ఈజీగా పడుతూ ఉంటాయి. మరి అగ్ని పరీక్ష షో లో నుంచి వచ్చిన కామన్ మ్యాన్ జనానికి పరిచయం అవ్వాలంటే వాళ్ళ మెంటాలిటీ జనానికి తెలియాలి. మరి అలా తెలియాలి అంటే వాళ్లకు డిఫరెంట్ టాస్క్ లు పెట్టి వాళ్ళు ఎంత జెన్యూన్ గా వాటిని ఎదుర్కుంటారు అనేది తెలుసుకోవాలి అలాగే జనంలో వాళ్లకి సపరేట్ క్రేజ్ ను కూడా సంపాదించుకునేలా వాళ్లను తయారు చేస్తున్నాం…
అందువల్ల జడ్జెస్ కొంచెం కఠినంగా ఉండాల్సిన పరిస్థితి అయితే వచ్చింది అంటూ ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. మొత్తానికైతే అగ్నిపరీక్ష నుంచి కామన్ మ్యాన్స్ ను సైతం బిగ్ బాస్ షో లో భాగం చేయడం అనేది ఒక కొత్త ఐడియా… మరి ఈ ఐడియాతో బిగ్ బాస్ సీజన్ 9 ఏ మేరకు సక్సెస్ అవుతోంది అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…