హైదరాబాద్, సెప్టెంబర్ 1: రాష్ట్ర నిరుద్యోగులకు టి-శాట్ నెట్‌వర్క్ ఛానల్ శుభవార్త తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగాలు, పాఠశాల విద్య వంటి అంశాలపై డిజిటల్ కంటెంట్ అందించేందుకు టి-శాట్ నెట్‌వర్క్ ఛానళ్లు ముందుకొచ్చాయి. ఇందులో భాగంగా బ్యాంక్ ఉద్యోగాల పోటీ పరీక్షలకు ప్రత్యేక డిజిటల్ కంటెంట్‌ను అందించనున్నట్లు పేర్కొన్నాయి. దేశవ్యాప్తంగా నిర్వహించే ఐబీపీఎస్ పోటీ పరీక్షలకు సంబంధించి తెలుగు, మీడియంలో ప్రత్యేక ప్రసారాలు చేయనుంది. ఈ మేరకు షెడ్యూల్ ఖరారు చేసింది. టి-శాట్ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్‌రెడ్డి ఆగస్టు 31న ప్రసారాలకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తూ ఈ విషయం తెలిపారు. సెప్టెంబరు 1 నుంచి సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు నిపుణ ఛానల్‌లో ప్రసారమయ్యే డిజిటల్ పాఠ్యాంశాల ప్రసారాలు అక్టోబరు 3వ తేదీ వరకు ఏకంగా 35 రోజులపాటు కొనసాగుతాయని ఆయన వివరించారు.
అంబేడ్కర్ వర్సిటీ డిగ్రీ, పీజీ ప్రవేశ గడువు పెంపు.. ఎప్పటివరకంటే?
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక యూనివర్సి పరిధిలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి డిగ్రీ, పీజీ, డిప్లొమాతోపాటు పలు సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తుల గడువు పొడిగిస్తూ ప్రకటన వెలువరించింది. తాజా ప్రకటన మేరకు సెప్టెంబరు 12వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు వర్సిటీ విద్యార్థి సేవల విభాగం అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. 2023-24, 2024-25 విద్యాసంవత్సరాల్లో డిగ్రీలో చేరి సెకండ్, థార్డ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులతోపాటు అంతకుముందు డిగ్రీ, పీజీల్లో చేరి సకాలంలో ఫీజు చెల్లించని విద్యార్ధులు కూడా సెప్టెంబరు 12వ తేదీలోపు ట్యూషన్ ఫీజు ఆన్‌లైన్ విధానంలో చెల్లించాలని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.