బూటులో పాము కాటు..టెకీ మృతి

బూటులో పాము కాటు..టెకీ మృతి

ఐటి నగరం బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీరు ప్రకాశ్ పాము కాటుతో మృతి చెందాడు. విచిత్రం విషాదం ఏమిటంటే ఆయన వేసుకునే బూట్లలో ఒక దాంట్లో తిష్టవేసుకుని ఉన్న తాచుపాము ఆయన పాదం పడగానే కాటేసింది. శనివారం జరిగిన ఈ ఘటన తరువాత ప్రకాశ్ చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందాడని సోమవారం ఆయన సన్నిహితులు తెలిపారు. మంజు ప్రకాశ్ అనే ఈ 41 ఏండ్ల వ్యక్తి టిసిఎస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీరు. రంగనాథ లే ఔట్‌లో నివసిస్తున్నాడు. గతంలో జరిగిన ఓ ప్రమాదంలో ఆయనకు కాళ్లలో స్పర్శ తెలియకుండా పోయింది. దీనితో బూట్లలో ఉన్న సర్పాన్ని గుర్తించలేకపోయినా ఆయన కాటుకు గురయ్యి మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. ఆయన బంధువులకు సమాచారం అందించారు. బాధాకరం ఏమిటంటే కాలుకు పాము కాటేసిన తరువాత కూడా ఆయనకు స్పర్శ లేకపోవడంతో గుర్తించలేకపోయ్యాడు. తరువాత బెడ్‌పైకి వెళ్లి పడుకుని , విష ప్రభావంతో మృతి చెందాడని ఆయన తల్లి ఆవేదనతో తెలిపింది.

Leave a Comment