నిర్మాత నాగవంశీ ని కాపాడిన డబ్బింగ్ సినిమా..!

Kotha Lokah Movie Collections: దెబ్బ మీద దెబ్బ..సినీ ఇండస్ట్రీ ని వదిలి పారిపోయాడు..దుబాయ్ లో ఉన్న ఆస్తులను అమ్ముకున్నాడు అంటూ ఈమధ్య కాలం లో మనం ప్రముఖ యంగ్ నిర్మాత నాగవంశీ(Nagavamsi) గురించి ఎన్నో కథలు విన్నాము. ఈ వార్తలు ఆయన వరకు చేరడం తో నేను ఎక్కడికి వెళ్ళలేదు, త్వరలోనే మాస్ జాతర మూవీ ప్రొమోషన్స్ లో కలుద్దాం అంటూ ట్విట్టర్ ద్వారా రెస్పాన్స్ ఇచ్చాడు. కరోనా లాక్ డౌన్ తర్వాత నిర్మాతగా అత్యధిక సక్సెస్ రేట్ ఉన్నది నాగవంశీ కి మాత్రమే. కానీ రీసెంట్ గా ఆయన ‘కింగ్డమ్’ చిత్రం తో భారీ ఫ్లాప్ ని మూటగట్టుకున్నాడు. ఈ సినిమాకు ముందు ఆయన డిస్ట్రిబ్యూట్ చేసిన ‘రెట్రో’ చిత్రం కూడా పెద్ద ఫ్లాప్ అయ్యింది. ఇక రీసెంట్ గా ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన ‘వార్ 2’ తో చావు దెబ్బ తిన్నాడు అనే చెప్పాలి.

ఇన్ని వరుస ఫ్లాప్స్ తో డీలా పడిన నాగవంశీ ఒక మలయాళం డబ్బింగ్ సినిమాతో మళ్లీ సేఫ్ అయ్యాడు. ప్రముఖ హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్(Kalyani Priyadarshan) నటించిన ‘లోక్’ అనే చిత్రాన్ని ‘కొత్త లోక'(Kotha Loka) అనే పేరుతో తెలుగు లోకి డబ్ చేశాడు. ఈ సినిమాకు ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సాధారణంగా తానూ నిర్మించిన సినిమాకు అయినా, డిస్ట్రిబ్యూట్ చేసే సినిమాకు అయినా ప్రొమోషన్స్ చేసే విషయం లో ఎక్కడా వెనకాడలేదు నాగవంశీ. కానీ ఈ చిత్రానికి అసలు ప్రొమోషన్స్ చేయలేదు. అయినప్పటికి మౌత్ టాక్ తో డీసెంట్ స్థాయి వసూళ్లను రాబట్టి సూపర్ హిట్ గా తెలుగు వెర్షన్ లో నిల్చింది. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి నాలుగు రోజులకు కలిపి తెలుగు వెర్షన్ లో 5 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయట. ఈ చిత్రాన్ని నాగవంశీ కేవలం రెండు కోట్ల రూపాయలకు కొనుగోలు చేసాడు.

ఆయన ఈ చిత్రం కోసం పెట్టిన డబ్బు కేవలం మొదటి లాంగ్ వీకెండ్ లోనే రావడం గమనించాల్సిన విషయం. గత మూడు చిత్రాలు ఆయనకు చేసిన గాయాలకు మందుపూసే రకమైన హిట్ అని ఈ చిత్రాన్ని చెప్పలేము కానీ, ఉన్న దరిద్రంలో కాస్త ఊపిరి పీల్చుకునేలా చేసింది అని మాత్రం చెప్పగలం. ఇకపోతే వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం అన్ని భాషలకు కలిపి నాలుగు రోజుల్లో 65 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. లేడీ ఓరియెంటెడ్ చిత్రానికి ఈ రేంజ్ గ్రాస్ వసూళ్లు అంటే సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అని అనుకోవచ్చు. ఇదే రేంజ్ ట్రెండ్ ని కొనసాగిస్తూ ఈ చిత్రం ముందుకు వెళ్తే మాత్రం కచ్చితంగా ఫుల్ రన్ లో 200 కోట్ల గ్రాస్ మార్కుని అందుకునే అవకాశాలు ఉంటాయి.

Leave a Comment