
మీరు మీ జీర్ణక్రియను మెరుగుపరచడానికి ఒక సహజమైన మార్గం కోసం చూస్తున్నట్లయితే.. కివీ పండు చాలా మంచిది. రోజుకు రెండు పచ్చి కివీలు తింటే జీర్ణవ్యవస్థకు చాలా లాభాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ విషయంపై పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కివీలోని పోషకాలు
ఒక కివీ పండు పెద్ద వారికి అవసరమైన విటమిన్ సి లో 80 శాతం వరకు అందిస్తుంది. అంతేకాకుండా ఇందులో 2 నుండి 4 గ్రాముల వరకు ఫైబర్ ఉంటుంది. కివీలో విటమిన్ ఇ, విటమిన్ కె, అలాగే యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. యాక్టినిడిన్ అనే ఒక ప్రత్యేకమైన ఎంజైమ్ ఇందులో ఉంటుంది. ఇది మనం తిన్న ఆహారంలోని ప్రోటీన్లను విడగొట్టడానికి సహాయపడుతుంది.
పరిశోధనలు ఏం చెబుతున్నాయి..?
2022లో జరిగిన ఒక అధ్యయనంలో నాలుగు వారాల పాటు రోజుకు రెండు కివీలు తిన్న వారి జీర్ణక్రియ బాగా మెరుగుపడింది. ముఖ్యంగా మలబద్ధకంతో బాధపడేవారికి కడుపు నొప్పి, ఒత్తిడి, అజీర్ణ సమస్యలు తగ్గాయి. 2023లో ప్రచురించిన మరో పరిశోధన కూడా ఇదే విషయాన్ని తేల్చింది. మలబద్ధకం లేదా ఐబిఎస్-సి (IBS-C) సమస్యలు ఉన్నవారికి రోజువారీ కివీ తినడం వల్ల ప్రేగుల కదలికలు పెరిగి జీర్ణక్రియ మెరుగుపడింది.
మొత్తం ఆరోగ్యానికి లాభాలు
కివీ పండు కేవలం జీర్ణక్రియకే కాకుండా.. మొత్తం ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది. కివీలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ వంటి పోషకాలు మన రోజువారీ ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి అని నిపుణులు అంటున్నారు.
రోజువారీ ఆహారంలో రెండు కివీలు తినడం ప్రేగుల ఆరోగ్యాన్ని, మొత్తం శరీరాన్ని బాగా ఉంచుకోవడానికి ఒక సులభమైన, రుచికరమైన మార్గం. దీని కోసం ప్రత్యేకంగా ఎలాంటి మందులు తీసుకోవాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
[