ఈ ఇయర్ డిసెంబర్ పరిస్థితి ఏంటి..?

December Release Movies 2025: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన కూడా తమకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు దూసుకెళుతున్న స్టార్ హీరోలు చాలా మంది ఉన్నారు…ఇక ఇప్పటి నుంచి వరుసగా ప్రతి నెల పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటూ మేకర్స్ అనౌన్స్ చేసినప్పటికి డిసెంబర్ నెలను మాత్రం ఖాళీగా వదిలేస్తున్నట్టుగా తెలుస్తోంది. మొన్నటిదాకా రాజాసాబ్ సినిమా డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుందంటూ వార్తలు వచ్చినప్పటికి ఆ సినిమాని ఇప్పుడు సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశ్యంతోనే మేకర్స్ అయితే ఉన్నారట. ఇక ఈ సినిమాని సైతం సెప్టెంబర్ 25వ తేదీన రిలీజ్ చేస్తున్నాం అని చెప్పినప్పటికి ఈ సినిమాని సైతం సంక్రాంతి బరిలో దింపాలనే ప్రయత్నంలో మేకర్స్ అయితే ఉన్నట్టుగా తెలుస్తోంది…గత కొన్ని సంవత్సరాల నుంచి డిసెంబర్ నెల అనేది సినిమా వాళ్లకి చాలా సెంటిమెంట్ గా మారింది. డిసెంబర్ మాసంలో వచ్చిన పెద్ద సినిమాలు సూపర్ సక్సెస్ ని సాధిస్తున్నాయి. పుష్ప, పుష్ప 2, సలార్, అనిమల్ లాంటి సినిమాలు వచ్చి సూపర్ సక్సెస్ లను సాధించాయి…

ఇక ఇప్పటివరకు భారీ రికార్డులను సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న సినిమా ఇండస్ట్రీలో డిసెంబర్ నెల అనేది చాలా సెంటిమెంట్ గా మారింది. మరి ఈ సంవత్సరం డిసెంబర్ నెల నుంచి ఒక సినిమా కూడా రాకపోవడం అనేది ప్రేక్షకులు, అభిమానులు సైతం చాలావరకు బాధపడుతున్నట్టుగా తెలుస్తోంది.

మరి అన్ని సినిమాలు సంక్రాంతికి వస్తే సంక్రాంతి పోటీ అనేది తీవ్ర తరమవుతోంది. కాబట్టి కొన్ని సినిమాలను డిసెంబర్లో రిలీజ్ చేసుకుంటే మంచిదనే ధోరణిలో కూడా కొంతమంది సినిమా మేధావులు ప్రొడ్యూసర్లకు సలహాలు ఇస్తున్నారు. మరి ఇప్పటికైనా ఎవరైనా ప్రొడ్యూసర్స్ ముందుకు వచ్చి డిసెంబర్ నెలలో రిలీజ్ చేసుకుంటే మంచిది. ఇప్పటికే సినిమాలన్ని ఒకేసారి రిలీజ్ కి రెడీ అవుతున్నాయి.

అలా కాకుండా ఖాళీగా ఉన్న సమయంలో సినిమా రిలీజ్ చేసుకుంటే మంచిది కదా అని ధోరణిలో కూడా కొంతమంది విమర్శకులు అయితే సినిమా ఇండస్ట్రీ మీద కొన్ని విమర్శలు చేస్తున్నారు… చూడాలి మరి ఇప్పటికైనా సినిమాలను డిసెంబర్ లో తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయా లేదా అనేది తెలియాల్సి ఉంది…

Leave a Comment