ఆగస్టు నెలలో సినిమాల రిజల్ట్ ఇలా ఉందేంటి..?

August Movies Results: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ పరిస్థితి దారుణంగా తయారైంది…ప్రేక్షకులు ఏ సినిమాని చూస్తున్నారు ఎలాంటి సినిమాని ఆదరిస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద ఏ సినిమా సక్సెస్ గా నిలుస్తుందనే విషయంలో చాలావరకు కన్ఫ్యూజన్స్ అయితే ఉన్నాయి. మరి ఏది ఏమైనా కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక సినిమా సక్సెస్ అవ్వడం అనేది చాలా పెద్ద టాస్క్ అనే చెప్పాలి. ఇక ఆగస్టు నెలలో చాలా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికి ఏ సినిమా కూడా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడం అనేది ఇప్పుడు అందరిలో ఒక కన్ఫ్యూజన్ ను. అయితే క్రియేట్ చేస్తోంది. నిజానికి ప్రేక్షకులకు నచ్చే సినిమాలను మేకర్స్ తీయడం లేదా? లేకపోతే ప్రేక్షకులు ఆ సినిమా నచ్చిన కూడా వాళ్ళు థియేటర్ కి వెళ్లి సినిమాలను చూసే అంత ఇంట్రెస్ట్ లేక సినిమాలను చూడకుండా మానేస్తున్నారా అనే ధోరణిలోనే ఇప్పుడు కొన్ని చర్చలైతే జరుగుతున్నాయి…ఆగస్టు నెలలో రిలీజ్ అయిన సినిమాల పరిస్థితి మరి దారుణంగా తయారైంది. ఆగస్టు 14వ తేదీన రజనీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజు దర్శకత్వంలో వచ్చిన కూలీ సినిమా రిలీజ్ అయింది. ఇక దీంతో పాటుగా ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కలిసి చేసిన ‘వార్ 2’ సినిమా కూడా అదే రోజు రిలీజ్ అయింది. ఈ రెండు సినిమాల పరిస్థితి కూడా ఒకేలా ఉంది.

రెండు సినిమాలు కూడా మొదటి షో తోనే ప్లాప్ టాక్ ని తెచ్చుకోవడంతో ఈ సినిమాను చూడ్డానికి ఎవరూ పెద్దగా ఆసక్తి అయితే చూపించలేదు. తద్వారా ఈ సినిమాలు కనీస వసూళ్లను కూడా సాధించలేకపోవడం విశేషం…మరి ఏది ఏమైనా కూడా ఒక స్టార్ హీరో నుంచి వచ్చిన సినిమాలు ఏ మేరకు ప్లాప్ టాక్ ని తెచ్చుకోవడం అనేది నిజంగా చాలా దారుణమైన విషయమనే చెప్పాలి…

ఇక ఈ సినిమాల తర్వాత అనుపమ పరమేశ్వరన్ మెయిన్ లీడ్ లో పరదా సినిమా వచ్చింది. అయితే ఈ సినిమా కూడా విజయాన్ని సాధించలేదు…ఇక లాస్ట్ వీక్ లో వచ్చిన కొత్త లోక చాప్టర్ వన్ సినిమా ఓకే అనిపించుకున్నప్పటికి కలెక్షన్స్ విషయంలో మాత్రం చాలా వరకు వెనుకబడిపోయింది. ఇక దాంతోపాటుగా త్రిభానాదారి భార్భారిక్ సినిమా కూడా రిలీజ్ అయింది.

మరి ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికి ఈ మూవీని చూడడానికి ఏ ప్రేక్షకులు ఆసక్తి చూపించడం లేదు… ఆగస్టు నెల పరిస్థితి ఇలా ముగిసిపోతే సెప్టెంబర్ నెలలో వస్తున్న ఓజి సినిమా అయితే వస్తోంది. మరి ఈ సినిమా పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

Leave a Comment