Jagan Vs Chandrababu: రాజకీయ పార్టీల నేతలకు విశాల దృక్పథం ఉండాలి. అన్ని కోణాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. రాగద్వేషాలకు అతీతంగా ఉండాలి. రాజకీయం చేయవచ్చు కానీ ఈర్ష్యా ద్వేషాలకు చోటు ఇవ్వకూడదు. అలా ఈర్ష్యపడి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎంతో నష్టపోయారు. కేవలం చంద్రబాబుకు క్రెడిట్ దక్కుతుందన్న ఆలోచనతో చాలా ప్రాజెక్టులను పక్కన పడేశారు. తద్వారా ఆయనే చంద్రబాబుకు క్రెడిట్ దక్కేలా చేశారు. అమరావతి రాజధాని నిర్మాణంలో అదే పరిస్థితి ఎదురయింది. ఇప్పుడు శ్రీశైలం నుంచి హింద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్ట్ ద్వారా కుప్పం వరకు కృష్ణమ్మ నీటిని ప్రవహించడంతో జగన్మోహన్ రెడ్డి వైఫల్యం స్పష్టంగా కనిపించింది.
* గతంలోనే చంద్రబాబు ప్రయత్నం..
గతంలోనే కుప్పంకు( Kuppam ) కృష్ణా జలాలను తీసుకెళ్లే ప్రయత్నం చేశారు చంద్రబాబు. అయితే దానిని కొనసాగిస్తే చంద్రబాబుకు క్రెడిట్ దక్కుతుందని భావించారు జగన్మోహన్ రెడ్డి. ఆ ఈర్షతోనే ప్రాజెక్టును పక్కన పెట్టేశారు. కర్నూలుకి న్యాయ రాజధాని పేరుతో ఓట్లు దండుకునేందుకు సిద్ధపడ్డారు. కానీ ఆ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేస్తే సీమ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి పోవచ్చు అన్న ఆలోచన చేయలేకపోయారు. వై నాట్ కుప్పం అంటూ చంద్రబాబు రాజకీయ పతనానికి పరితపించారే తప్ప.. వారికి నీరు ఇచ్చి ప్రజల అభిమానాన్ని పొందవచ్చు అన్న ఆలోచన చేయలేకపోయారు జగన్మోహన్ రెడ్డి. కేవలం ఈర్ష్య అనే అంశం జగన్మోహన్ రెడ్డికి ఆ పని చేయనివ్వలేదు.
* సీమ ప్రజల సానుకూలత..
ఇప్పుడు చంద్రబాబు( CM Chandrababu) గురించి ఆలోచన చేస్తున్నారు రాయలసీమ ప్రజలు. ఎందుకంటే శ్రీశైలం నుంచి 700 కిలోమీటర్ల దూరం ప్రయాణించి.. కృష్ణా జలాలు శుక్రవారం కుప్పం కు చేరుకున్నాయి. దశాబ్దాలుగా కృష్ణమ్మ కోసం ఎదురుచూస్తున్న రాయలసీమ ప్రజలు ఈ దృశ్యాన్ని చూసి పులకించుకుపోయారు. తమ ఊర్ల మధ్య నుంచి కాలువలో మారుతున్న కృష్ణానది జలాలను చూసి ఆనందంతో పరవశించిపోయారు. రాయలసీమ జిల్లాల్లో టిడిపి కూటమి పార్టీల కార్యకర్తల సందరికి అవధులు లేకుండా పోయాయి. ఈ ఒక్క ప్రాజెక్టు ద్వారా రాయలసీమలో ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. పది లక్షల మందికి తాగునీరు కూడా అందనుంది ఈ ప్రాజెక్టు ద్వారా.. ఒకవైపు తెలంగాణ నుంచి అభ్యంతరాలు, మరోవైపు జగన్ ఈర్ష్య.. ఇవన్నీ చంద్రబాబులో పట్టుదల పెంచాయి. ఆయనకు ఎనలేని గుర్తింపు తీసుకొచ్చేలా చేశాయి.