Sandeep Reddy Vanga And Tripti Dimri: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అర్జున్ రెడ్డి సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు సందీప్ రెడ్డివంగ…మొదటి సినిమాతోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేసిన ఆయన ఆ తర్వాత రణ్బీర్ కపూర్ తో చేసిన ‘ఆనిమల్’ సినిమాతో ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్ గా ఎదిగిపోయాడు. ప్రస్తుతం పాన్ ఇండియాలో ఉన్న స్టార్ హీరోలందరు ఆయనతో సినిమాలు చేయాలనుకోవడం విశేషం…ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇకమీదట ఆయన చేయబోతున్న సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి. యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అతనికి చాలా మంచి గుర్తింపైతే ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రభాస్ తో చేస్తున్న సినిమాతో తన క్రేజ్ ను మరింత పెంచుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం స్పిరిట్ సినిమాతో ఆయన చాలా బిజీగా ఉన్నాడు…
Also Read: ప్రభాస్ పెళ్లి చెడగొట్టింది ఎవరు..? అందుకే ఆయన ఇక మ్యారేజ్ చేసుకొనని డిసైడ్ అయ్యాడా..?
ఇక ఈ సినిమాలో మొదట దీపిక పదుకొనే ను హీరోయిన్ గా తీసుకోవాలని అనుకున్నప్పటికి ఆమె పెట్టిన కండిషన్స్ సందీప్ రెడ్డి వంగ కు నచ్చకపోవడంతో ఆమెను పక్కనపెట్టి అనిమల్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించిన త్రిప్తి డిమ్రి ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా తీసుకున్నాడు…
ఇక ఇది చూసిన చాలామంది సందీప్ రెడ్డి వంగ కి త్రిప్తి డిమ్రి కి మధ్య ఏదో రిలేషన్ షిప్ అయితే ఉందని అందువల్లే ఆయన తనను కావాలనే ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నాడని లేకపోతే ప్రభాస్ సినిమాలో హీరోయిన్ గా చేసే రేంజ్ తనకు లేదని చాలామంది అభిప్రాయాలను తెలియజేశారు… సందీప్ మాత్రం వీటన్నింటినీ పట్టించుకోకుండా లైట్ తీసుకున్నాడు. ఎందుకంటే సందీప్ ఎవరు ఏమనుకున్నా తను పట్టించుకోనని ఇంతకుముందు చాలా ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇక మొత్తానికైతే తన సినిమాకి త్రిప్తి చాలా వరకు హెల్ప్ అవుతుందనే ఉద్దేశ్యంతోనే ఆమెను ఈ సినిమాలో తీసుకున్నట్టుగా తెలుస్తోంది.
ఇంక తన సన్నిహిత వర్గాల నుంచి వస్తున్న వార్తల ప్రకారం త్రిప్తి అయితేనే ఆ పాత్రకి పర్ఫెక్ట్ గా న్యాయం చేయగలరని, ఎందుకంటే అందులో కొన్ని బోల్డ్ సీన్స్ కూడా ఉన్నాయని ఆమె అయితే ఎలాంటి అబ్జెక్షన్స్ లేకుండా చేస్తుందనే ఉద్దేశంతోనే త్రిప్తిని ఈ సినిమాలో తీసుకున్నామని చెబుతున్నారు. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా సెట్స్ మీదకి ఎప్పుడు వెళ్తుంది, ఎప్పుడు రిలీజ్ అవుతుందనే దాని మీదనే ఇప్పుడు సర్వత్ర ఆసక్తి అయితే నెలకొంది…