పాత మిత్రులమే.. గంగులపై ఒత్తిడి ఉంటే నేను చూసుకుంటా: సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారో తెలుసా – Telugu News | Old Friends: Revanth Reddy, Gangula Kamalakar Funny Clash, BC Reservations Bill Debate Heats Up – Political Videos in Telugu

బీసీ బిల్లుపై చర్చ సందర్భంగా అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి, గంగుల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది.. గంగులపై ఒత్తిడి ఉంటే నేను చూసుకుంటా.. మనం పాత మిత్రులమే కదా.. ఆరోపణలు చేయకుండా సూచనలు చేయండి.. అంటూ రేవంత్ పేర్కొన్నారు. ఎవరి ఒత్తిడితోనే గంగుల విమర్శలు చేస్తున్నారని, గంగులపై ఒత్తిడి ఉంటే తాను చూసుకుంటానని సీఎం చమత్కరించారు. శాస్త్రీయంగా సర్వేచేయకపోవడంతో BC బిల్లుకు చిక్కులని.. తమిళనాడు తరహాలో శాస్త్రీయంగా కులగణన సర్వేచేయాలని.. బీఆర్ఎస్ పార్టీ తరపున సూచించాం అంటూ గంగుల పేర్కొన్నారు. బీసీలకు న్యాయం చేయాలని చిత్తశుద్ధితో ఉన్నామని అంతా బిల్లుకు సహకరించాలని సీఎం సభను కోరారు. బీసీ రిజర్వేషన్లు గంగులకు ఇష్టమే.. కానీ వాళ్ల నాయకులకే ఇష్టం లేదంటూ సీఎం పేర్కొన్నారు.

Leave a Comment