జాతీయ ఫెన్సింగ్‌ పోటీలకు 24మంది ఎంపిక

– Advertisement –

హైదరాబాద్‌ : జాతీయ క్యాడెట్‌ అండర్‌-17 ఫెన్సింగ్‌ పోటీలకు తెలంగాణ నుంచి 24 మంది ఫెన్సర్లు ఎంపికయ్యారు. బాచుపల్లిలోని మమత అకాడమీ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ క్యాంప్‌లో నిర్వహించిన సెలక్షన్‌ ట్రయల్స్‌లో 88 మంది ఫెన్సర్లు పోటీపడ్డారు. ట్రయల్స్‌లో ఎంపికైన 24 మంది ఫెన్సర్లు ఈ నెల 8 నుంచి 13 వరకు ఉత్తరాఖాండ్‌లో జరుగనున్న జాతీయ పోటీల్లో తెలంగాణకు ప్రాతినిథ్యం వహించనున్నారు. జాతీయ పోటీలకు ఎంపికైన ఫెన్సర్లను మమత వైద్య సంస్థ అధికారి ప్రణీత్‌ రెడ్డి, స్పోర్ట్స్‌ ఇన్‌చార్జ్‌ ధీరజ్‌ రెడ్డి, రాష్ట్ర ఫెన్సింగ్‌ సంఘం కార్యదర్శి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడు సందీప్‌ జాదవ్‌ అభినందించారు.

– Advertisement –

Leave a Comment