Yash Mother: KGF సిరీస్ హీరో రాకింగ్ స్టార్ యాష్(Rocking Star Yash) తల్లి సినీ ఇండస్ట్రీ లో ఒక ప్రముఖ నిర్మాత అనే విషయం చాలా మందికి తెలియదు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజ్ లేకుండా, ఒక మామూలు టీవీ యాంకర్ గా కెరీర్ ని మొదలు పెట్టిన యాష్,ఇప్పుడు పాన్ ఇండియన్ సూపర్ స్టార్ గా ఎదిగాడు. ఇండస్ట్రీ లో హీరో గా స్థిరపడి డబ్బులు బాగా సంపాదించిన తర్వాత తన తల్లి పుష్ప చేత ప్రొడక్షన్ హౌస్ పెట్టించాడు. ఆమె తన ఆసక్తి కి , అభిరుచికి తగ్గట్టుగా సినిమాలను నిర్మిస్తూ ముందుకు దూసుకుపోతుంది. రీసెంట్ గా ఆమె కన్నడ లో ‘కొత్తలవాడి’ అనే చిత్రాన్ని నిర్మించింది. ఈ నెల 1వ తారీఖున విడుదలైన ఈ చిత్రం కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. అయితే విడుదలకు ముందు ఈ సినిమా ప్రొమోషన్స్ లో ఆమె ప్రముఖ కన్నడ హీరోయిన్ దీపికా దాస్(Deepika Das) పై పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.
Also Read: ‘సింగర్ ఆఫ్ ది ప్యారడైజ్’ ఫుల్ మూవీ రివ్యూ…హిట్టా? ఫట్టా?
ఒక రిపోర్టర్ పుష్ప(Pushpa) ని ఒక ప్రశ్న అడుగుతూ ‘మీ తదుపరి చిత్రం లో దీపికా దాస్ ని హీరోయిన్ గా తీసుకునే అవకాశాలు ఉన్నాయా’ అని అడుగుతాడు. దానికి చిరాకు పడిన పుష్ప ‘ఈ ఇండస్ట్రీ లో దీపికా దాస్ తప్ప మరో హీరోయిన్ లేరని అనుకుంటున్నారా?, ప్రతీసారి ఆమె గురించే ఎందుకు ప్రత్యేకించి అడుగుతూ ఉంటారు?. రమ్య రక్షిత గురించి అడగొచ్చు గా, వేరే ఏ హీరోయిన్ గురించి అయినా అడగొచ్చు కదా?, దీపికా పెద్ద స్టార్ హీరోయినా?, ఆమె తన కెరీర్ లో సాధించినది ఏమిటి?, ఎందుకు ఆమె కోసం ప్రత్యేకంగా అడుగుతున్నారు?’ అని అంటుంది. వాస్తవానికి యాష్, దీపికా దాస్ వరుసకు కజిన్స్ అవుతారు. అందుకే మీడియా ఫోకస్ యాష్ కి సంబంధించిన వాటిల్లో దీపికా మీద కూడా ఎక్కువగా ఉంటుంది.
అయితే యాష్ తల్లి పుష్ప చేసిన ఈ కామెంట్స్ పై దీపికా దాస్ చాలా గట్టిగానే స్పందించింది. ఆమె మాట్లాడుతూ ‘కొత్తవాళ్ళని ఇండస్ట్రీ కి పరిచయం చెయ్యాలని అనుకునేవాళ్లు, ముందు కొత్తవాళ్లకు గౌరవం ఇవ్వడం నేర్చుకోండి. నేను ఎవరి పేరుని వాడుకొని ఇండస్ట్రీ లోకి రావాలని అనుకోలేదు. నా సొంత టాలెంట్ మీదనే నిలబడాలని అనుకుంటున్నాను. ఆత్మగౌరవం ఉన్న మనిషిని నేను. నన్ను మా అమ్మ అయినా, పుష్పమ్మ అయినా సరే, నా గురించి చెడుగా మాట్లాడే హక్కు లేదు’ అంటూ చాలా ఘాటుగా స్పందించింది. వీళ్ళ మధ్య జరుగుతున్న మాటల యుద్దాన్ని చూస్తుంటే, వీళ్ళ కుటుంబం లో కలహాలు ఉన్నట్లుగా అనిపిస్తుంది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. ఇకపోతే దీపికా దాస్ గతం లో కన్నడ బిగ్ బాస్ సీజన్ 7 లో ఒక కంటెస్టెంట్ గా కూడా పాల్గొన్నది.