Trump Tariffs: ట్రంప్ ఇండియాతో పెట్టుకుంటున్నావ్?

Trump Tariffs: అమెరికా అధ్యక్షుడిని ఆ దేశ ప్రయోజనాలకన్నా.. ప్రపంచ దేశాల మేలుకన్నా.. వ్యక్తిగత ఇమేజ్‌ చాలా ముఖ్యం. అందుకోసం దేనికీ వెనుకాడరు. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక అమెరికా ఫస్ట్‌ అనే నినాదంతో దూకుడు నిర్ణయాలతో అభాసుపాలవుతున్నారు. అయితే అమెరికా ఫస్ట్‌ అనేది కేవలం నినాదంగానే మిగిలిపోయేలా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ట్రంపు సార్వారికి నోబెల్‌ ప్రైజ్‌పై యావ పెరుగుతోంది. మన దాయది దేశంతోపాటు అనేక దేశాలో ట్రంప్‌ను నోబెల్‌ శాంతి బహుమతికి ప్రమోట్‌ చేస్తున్నారు. అయితే ట్రంప్‌ ఆశలపై భారత్‌ నీళ్లు చల్లింది. దీంతో కోపం పెంచుకున్న ట్రంప్‌ భారత్‌పై టారిఫ్‌లు విధిస్తున్నారు. 50 శాతం సుంకాలు విధించి భారత్‌ను ఆర్థికంగా దెబ్బతీయాలని చూస్తున్నారు. ఈ క్రమంలో అమెరికా ఆర్థికవేత్త రిచర్డ్‌ వోల్ఫ్‌ ట్రంప్‌ను హెచ్చరించారు. టారిఫ్‌ వార్‌ ఏనుగు లాంటి భారత్‌తో ఎలకలాంటి అమెరికా పెట్టుకున్నట్లు ఉందని విమర్శించారు. అమెరికా ఆర్థిక ఒత్తిళ్లు, టారిఫ్‌లు భారత్‌ను ఏమాత్రం ప్రభావితం చేయలేవని స్పష్టం చేశారు. పైగా బ్రిక్స్‌ వంటి కూటములను బలోపేతం చేస్తాయని, అది అమెరికాకే ప్రమాదమని వార్నింగ్‌ ఇచ్చారు.

Also Read: అసెంబ్లీలో ‘రుషికొండ’.. కూటమి ప్లాన్ అదే!

ప్రపంచ ఆర్థిక శక్తిగా భారత్‌..
ఐక్యరాజ్య సమితి గణాంకాల ప్రకారం, జనాభా పరంగా భారత్‌ ప్రపంచంలోనే అతిపెద్ద దేశం. ఆర్థిక వృద్ధి, యువ జనాభా, వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగంతో భారత్‌ ఒక ఆర్థిక శక్తిగా ఎదుగుతోంది. అందుకే రిచర్డ్‌ వోల్ఫ్‌ భారత్‌ను ఏనుగుతో పోల్చారు. ఇది పెరుగుతున్న భారత ఆర్థిక బలాన్ని, స్వతంత్ర విధానాలను సూచిస్తుంది. అమెరికా విధించే టారిఫ్‌లు లేదా ఆంక్షలు భారత్‌ను గణనీయంగా ప్రభావితం చేయలేవని తెలిపారు. భారత్‌ తన ఎగుమతుల కోసం ఇతర దేశాలతో (చైనా, రష్యా, ఆసియా–ఆఫ్రికా మార్కెట్లు) వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసుకోగలదని స్పష్టం చేశారు.

అమెరికా టారిఫ్‌లు ఎలుక లాంటివే..
వోల్ఫ్‌ ప్రకారం భారత్‌పై విధిస్తున్న అమెరికా టారిఫ్‌లు ఎనుగుపై ఎలుకను ప్రయోగిస్తున్నట్లుగా ఉన్నాయి. ఇవి ఏనుగును కించెత్తు కూడా ఏమీ చేయలేవు. టారిఫ్‌లు విధించడం ద్వారా భారత ఎగుమతులను అడ్డుకోవాలని చూస్తున్న అమెరికాకు భంగపాటు తప్పదని హెచ్చరించారు. భారత్‌ యొక్క ఆసియా, ఆఫ్రికా, మధ్యప్రాచ్య దేశాలతో వాణిజ్యం అమెరికా ఆధారిత ఆర్థిక వ్యవస్థపై ఆధారపడకుండా దాని ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుతుంది. అందుకే వోల్ఫ్‌ ఈ స్పష్టత ఇచ్చారు.

జీ7కి ప్రత్యామ్నాయ శక్తి..
వోల్ఫ్‌ హెచ్చరించినట్లు, అమెరికా యొక్క ఆర్థిక ఒత్తిళ్లు బ్రిక్స్‌ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) కూటమిని మరింత బలోపేతం చేస్తున్నాయి. ప్రపంచ ఉత్పత్తి వాటాలో జీ7ని అధిగమించిన బ్రిక్స్‌ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కొత్త శక్తిగా ఎదుగుతోంది. భారత్, చైనా, రష్యా వంటి దేశాలు కలిసి పాశ్చాత్య ఆధిపత్యానికి ప్రత్యామ్నాయంగా స్వతంత్ర ఆర్థిక వ్యవస్థను నిర్మిస్తున్నాయి. అమెరికా టారిఫ్‌లు ఈ ధోరణిని వేగవంతం చేస్తూ, బ్రిక్స్‌ దేశాల మధ్య సహకారాన్ని పెంచుతున్నాయి.
మరోవైపు అమెరికా ఆర్థిక ఒత్తిళ్లను ఎదుర్కొనేందుకు భారత్‌ బహుముఖ వాణిజ్య వ్యూహాన్ని అనుసరిస్తోంది. ఆసియా–పసిఫిక్, యూరప్, ఆఫ్రికా దేశాలతో వాణిజ్య ఒప్పందాలను బలోపేతం చేస్తూ, అమెరికాపై ఆధారపడకుండా ఆర్థిక స్థిరత్వాన్ని సాధిస్తోంది. బ్రిక్స్‌లో భారత్‌ యొక్క పాత్ర, దాని ఆర్థిక సామర్థ్యాలను మరింత పెంచుతోంది.

Leave a Comment