Trump Missing: ట్రంప్ మిస్సింగ్.. ఏమైంది? ప్రపంచవ్యాప్తంగా కలకలం

Trump Missing: ట్రంప్ మిస్సింగ్.. ఏమైంది? ప్రపంచవ్యాప్తంగా కలకలం

Trump Missing: ప్రపంచ దేశాల మీద సుంకాలు విధిస్తూ.. గిట్టని దేశాల మీద దాడులకు దిగుతూ.. శ్వేత సౌధ అధిపతి ట్రంప్ వికృతానందం పొందుతున్నారు. తనను తాను శాంతికామకుడిగా.. ప్రపంచ అభివృద్ధికి కారకుడిగా చెప్పుకుంటూ.. పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు. యుద్ధాలు చేసుకుంటూ.. తానే యుద్దాలను ఆపుతున్నట్టు పిచ్చిపిచ్చి ప్రేలాపనలకు పోతున్నారు. అటువంటి ట్రంప్ ఇప్పుడు కనిపించకుండా పోయారు. ఇప్పుడు ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది.

ట్రంప్ వయసు ప్రస్తుతం 79 సంవత్సరాలు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రచారం చేస్తుండగా ఆయన మీద దాడి జరిగింది. ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో బుల్లెట్ ఆయన చెవిని తాకుకుంటూ వెళ్ళింది. ఇక అప్పటినుంచి ట్రంప్ పై సానుభూతి పెరిగింది. ఆ ఎన్నికల్లో ఆయన పార్టీ గెలిచేలా చేసింది. అమెరికా శ్వేత సౌదాధిపతిగా ట్రంప్ పనికిమాలిన నిర్ణయాలు తీసుకుంటూ ప్రపంచ దేశాల నేతలకు కంటిమీద కునికు లేకుండా చేస్తున్నారు. చిత్ర విచిత్రమైన విధానాలకు పాల్పడుతూ అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. అటువంటి ట్రంప్ ఇప్పుడు కనిపించకుండా పోవడం రకరకాల చర్చలకు కారణమవుతోంది..

గడచిన 24 గంటలుగా అమెరికా అధిపతి కనిపించడం లేదని ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది.. పైగా ఆయన చేతిపై గాయాలు కూడా కనిపిస్తున్నాయని అమెరికన్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మీడియా ముందుకు ట్రంప్ రాక చాలా రోజులైంది. పైగా ఆయన ట్రూత్ ద్వారా మాత్రమే సంభాషిస్తున్నారు. ఏదైనా విషయం ఉంటే దాని ద్వారానే చెబుతున్నారు. మరోవైపు శని ఆదివారాలలో ఎటువంటి పబ్లిక్ ఈవెంట్లు లేకపోవడంతో.. ప్రపంచ వ్యాప్తంగా అనుమానాలు పెరిగిపోయాయి. ఇటీవల ట్రంప్ చేతి మీద గాయాలు కనిపించాయని అమెరికన్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.. గడచిన 24 గంటలుగా ట్రంప్ జాడ కనిపించడం లేదని.. మరో రెండు రోజులు కూడా ఎటువంటి పబ్లిక్ ఈవెంట్స్ లేకపోవడం అనుమానాలకు కారణమవుతుందని అమెరికన్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇదంతా చూస్తుంటే ఏదో జరుగుతోందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.. మరికొందరేమో ఇవన్నీ కూడా ఊహాగానాలు మాత్రమేనని.. ట్రంప్ ఆరోగ్యంగా ఉన్నారని.. ట్రూత్ ద్వారా సోషల్ పోస్టులు పెడుతున్నారని మరి కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు.

అమెరికాలో వచ్చెనెల 1వ తేదీన కార్మిక దినోత్సవం జరగనుంది. దీనివల్ల అమెరికా అధ్యక్షుడు ఎటువంటి పబ్లిక్ మీటింగ్ లలో పాల్గొనడం లేదని వైట్ హౌస్ వర్గాలు చెబుతున్నాయి. గతంలో ట్రంప్ చేతిపై గాయం కనిపించింది. దానిని దాచడానికి ఆయన మేకప్ వేసుకున్నారని వార్తలు వినిపించాయి.. ట్రంప్ వ్యక్తిగత వైద్యుడు సీన్ బార్బ బెల్లా ఆ గాయాన్ని ధ్రువీకరించారు. తరచుగా పర్యటనలు చేయడం.. ఇతరులతో కరచాలనం చేయడం వల్ల.. ట్రంప్ చేతికి ఆస్పి రిన్ వాడారని.. అందువల్లే చేతికి గాయం అయిందని.. ఆయనకు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవని సీన్ బార్బ బెల్లా పేర్కొన్నారు.

Leave a Comment