Trump is dead: ట్రంప్ పోయాడా? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్?

Trump is dead: ట్రంప్ పోయాడా? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్?

Trump is dead: ఈ ప్రపంచంలో పెద్ద దేశాలు చాలానే ఉన్నప్పటికీ.. అమెరికాలో ఏం జరిగినా సరే ఆ ప్రభావం ప్రపంచ దేశాల మీద పడుతుంది. అందువల్లే అమెరికాలో జరుగుతున్న ప్రతి పరిణామాన్ని ప్రపంచ దేశాలు అత్యంత జాగ్రత్తగా గమనిస్తూ ఉంటాయి. చివరికి సోషల్ మీడియా కూడా అమెరికా ద్వారానే ప్రభావితం అవుతూ ఉంటుంది.. తాజాగా సోషల్ మీడియా గ్లోబల్ వ్యాప్తంగా ఒకే అంశం మీద ఊగిపోతోంది. ఓకే టాపిక్ మీద శనివారం ఉదయం నుంచి లక్షల కొద్ది ట్వీట్లు.. సందేశాలతో ఉక్కిరిబిక్కిరి అవుతుంది.

గ్లోబల్ వ్యాప్తంగా ప్రచారం
శ్వేత దేశ అధిపతి పోయాడని.. ఆయన ఆరోగ్యం బాగోలేదని.. గడచిన 24 గంటలుగా ఆయన కనిపించడం లేదని.. అధికారిక కార్యక్రమాలలో పాల్గొనడం లేదని.. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నాడని.. కేవలం ట్రూత్ లో మాత్రమే ఆయన మాట్లాడుతున్నాడని గ్లోబల్ వ్యాప్తంగా ప్రచారం జరుగుతోంది. సామాజిక మాధ్యమాలలో ఇదే అంశం మీద విస్తృతమైన చర్చ నడుస్తోంది. ఇది ఎంతవరకు దారి తీస్తుంది.. ఈ పరిణామం ప్రపంచ దేశాల మీద ఎలా పడుతుంది.. అనే విషయాలను పక్కన పెడితే అసలు నిజానికి ట్రంప్ కు ఏమైందనేదే ఇప్పుడు అసలైన ప్రశ్నగా ఉంది.

ఇటీవల బాగానే ఉన్నారు
ఇటీవల రష్యా అధ్యక్షుడిని కలిసినప్పుడు ట్రంప్ ఆరోగ్యంగానే ఉన్నాడు. అతనితో కలిసి సరదాగా సంభాషించాడు. అంతకంటే కొద్దిరోజుల ముందు పాక్ సైనికాధిపతి మునీర్ తో ట్రంప్ భేటీ అయ్యాడు.. చాలాసేపు మాట్లాడాడు. వారిద్దరూ లంచ్ కూడా చేశారు.. అటువంటి ట్రంప్ ఇప్పుడు అనారోగ్యానికి గురి కావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అతని చేతికి గాయమైందని.. అందువల్లే ఆయన ఊహించిన స్థాయిలో యాక్టివ్ గా ఉండలేకపోతున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిని శ్వేత సౌధ అధికారులు ఖండిస్తున్నారు. ట్రంప్ బాగానే ఉన్నారని.. ప్రత్యేక కారణాల వల్ల ఆయన ఎటువంటి కార్యక్రమాలు పెట్టుకోలేదని వ్యాఖ్యానిస్తున్నారు.

తర్వాతి అధ్యక్షుడు ఆయనేనా?
మరోవైపు సోషల్ మీడియాలో మాత్రం ట్రంప్ ఇస్ డెడ్ అనే ట్వీట్ తెగ ట్రెండ్ అవుతోంది. ట్రంప్ శ్వేత సౌదంలో కనిపించకపోవడంతో ఎక్స్ వేదికగా చాలామంది పోస్టులు పెడుతున్నారు. మరోవైపు శ్వేత దేశ అధిపతి సీసీఐ వ్యాధితో బాధపడుతున్నట్టు ఇటీవల అమెరికా మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే దానిని వైట్ హౌస్ వర్గాలు ఖండించాయి. మరోవైపు దేశంలో ఒకవేళ టెర్రిబుల్ ట్రాజడీ గనుక సంభవిస్తే తాను అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని వైస్ ప్రెసిడెంట్ జెడి వాన్స్ ఇటీవల వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలు చూస్తుంటే అగ్రరాజ్య అధ్యక్షుడికి ఏదో అయిందని చర్చ నడుస్తోంది. అగ్రరాజ్య అధ్యక్షుడు బాగానే ఉన్నారని వైట్ హౌస్ వర్గాలు చెబుతున్నప్పటికీ.. దానిని ధ్రువీకరించే ఒక ఆధారాన్ని కూడా మీడియాకు విడుదల చేయడం లేదు. దీంతో అనుమానాలు మరింత బలపడుతున్నాయి.

Leave a Comment