Tilak Varma dance to OG Song: ‘ఓజీ’ పాటకు ఇండియన్ క్రికెటర్ తిలక్ వర్మ చిందులు.. వీడియో వైరల్!

Tilak Varma dance to OG Song: మరో 26 రోజుల్లో టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీజియస్ చిత్రం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) నటించిన ‘ఓజీ'(They Call Him OG) చిత్రం విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా సోషల్ మీడియా లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సినిమా మేనియా నే కనిపిస్తుంది . మూడు రోజుల క్రితం నార్త్ అమెరికా అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించడం,ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో ఇప్పటి వరకు ఏ సినిమాకు జరగనంతగా, కేవలం రెండున్నర రోజుల్లోనే హాఫ్ మిలియన్ కి పైగా డాలర్లను రాబట్టడం వంటివి జరగడంతో సోషల్ మీడియా లో ఇప్పుడు ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ అభిమానుల వీర విహారమే కనిపిస్తుంది. ఇతర హీరోల అభిమానులు కూడా ఓజీ చిత్రానికి నార్త్ అమెరికా బాక్స్ ఆఫీస్ వద్ద వస్తున్న గ్రాస్ వసూళ్లను చూసి నోరెళ్లబెడుతున్నారు. ఈ సినిమాకు మంచి హైప్ ఉంది, కచ్చితంగా మంచి ఓపెనింగ్స్ వస్తాయని అనుకున్నారు కానీ, ఈ రేంజ్ లో వస్తాయని మాత్రం ఊహించలేదు.

ఇదంతా పక్కన పెడితే ఈ నెల ప్రారంభం లో ఈ చిత్రం నుండి విడుదలైన ‘ఫైర్ స్ట్రోమ్’ పాట ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎక్కడ చూసినా ఈ పాటనే ఇప్పుడు వినిపిస్తూ ఉంది. అన్ని మ్యూజిక్ ప్లాట్ ఫార్మ్స్ లో ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉంది. సినీ సెలబ్రిటీలు మరియు క్రికెటర్స్ కూడా ఈ పాటని తెగ ఎంజాయ్ చేస్తున్నారు. రీసెంట్ గా ఇండియన్ క్రికెట్ ప్లేయర్ తిలక్ వర్మ(Tilak Varma) తన కారులో ఫైర్ స్ట్రోమ్ పాటని పెట్టుకొని, ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాడు. అందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఈ పాట బౌండరీలు దాటేసిందని, ఈ రేంజ్ లో రీచ్ అవుతుందని ఊహించలేదంటూ సోషల్ మీడియా లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఇకపోతే సెప్టెంబర్ 2 న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు అవ్వడం తో ఓజీ చిత్రం నుండి అభిమానులు టీజర్ వస్తుందని ఆశిస్తున్నారు. దీనిపై మేకర్స్ నుండి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అసలు టీజర్ ని విడుదల చేస్తారా?, లేదా కేవలం పోస్టర్ తోనే సరిపెడుతారా అంటూ సోషల్ మీడియా లో ఫ్యాన్స్ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మరి కొంతమంది చెప్తున్నది ఏమిటంటే సెప్టెంబర్ 2న ఓజీ కి సంబంధించి ఒక అద్భుతమైన పోస్టర్ వస్తుందని, సెప్టెంబర్ 5 న టీజర్ ని విడుదల చేస్తారని అంటున్నారు. ఇందులో ఎంత మాత్రం నిజముందో చూడాలి. కానీ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ టీం మాత్రం ఫ్యాన్స్ కి ఒక స్వీట్ సర్ప్రైజ్ ని ప్లాన్ చేసిందట. చిన్న గ్లింప్స్ వీడియో ని విడుదల చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారట.

Leave a Comment