Rise and fall of Gerald Ratner: ఒక్క మాటతో బిలియనీర్ నుంచి బిచ్చగాడిగా మారాడు.. అసలేంటి కథ?

Gerald Ratner Life Story: నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది.. అని పెద్దలు సామెత చెబుతూ ఉంటారు. చాలామంది ఈ సామెతను పెద్దగా పట్టించుకోరు. కానీ ఇందులో ఎంతో గూడార్ధం దాగి ఉంది. మాట్లాడే ప్రతి మాట చాలా విలువైనది అని ఈ సామెత అర్థం. అంతేకాకుండా ఉన్నత స్థితిలో ఉన్నవారు జాగ్రత్తగా మాట్లాడాలని ఈ సామెత తెలుపుతుంది. అయితే ఈ సామెత ఊరికే పుట్టలేదు. పూర్వకాలంలో కొందరు మాటల వల్ల తమ జీవితాలను కోల్పోయారు. ఇప్పుడు కూడా కోల్పోతున్నారు. అందుకు ఉదాహరణ ఈ స్టోరీ..

మనకు బంగారం గురించి తెలుసు.. వన్ గ్రామ్ గోల్డ్ గురించి తెలుసు.. కానీ అచ్చం బంగారంలా.. లేదా అచ్చం విలువైన ఆభరణాల వలే ఉండే కొన్ని వస్తువులు మార్కెట్లోకి వచ్చాయి. ఇవి బంగారం కాకపోయినా అచ్చం వాటిలా ఉండేవి. అంతేకాకుండా తక్కువ ధరకు మార్కెట్లో దొరికేవి. చాలామంది ప్రజలు బంగారం కొనే బదులు వీటినే కొనుగోలు చేశారు. ఆభరణాలు కావాలని అనుకునేవారు ఇవే కొనుగోలు చేశారు.

Gerald Ratner.. అనే బ్రిటన్ కు చెందిన వ్యాపారి ఇలాంటి ఆభరణాలను తయారు చేసేవారు. అచ్చం బంగారంలా ఉండే వీటిని మార్కెట్లోకి తీసుకురావడం వల్ల ఎంతోమంది కొనుగోలు చేశారు. దీంతో అతని రాబడి పెరిగిపోయింది. ఎంతలా అంటే 12 బిలియన్ యూరోలకు వెళ్ళింది. అంటే 12 వేల కోట్లు అన్నమాట. దీంతో చాలామంది ఇతనిని ఆదర్శంగా కూడా తీసుకున్నారు. కానీ ఒకే ఒక్క చిన్న మాటతో తన వేలకోట్ల సంపాదన ఆవిరి చేసుకున్నారు. విమానాలు, విలువైన కార్లను అమ్ముకున్నారు. ఎంతో హుందాగా ఉండే అతని జీవితం రోడ్డు మీద పడింది. అతనిని నమ్ముకున్న కుటుంబం బిక్షం ఎత్తుకునే స్థాయికి వచ్చింది. ఇంతకీ ఆయన ఏం మాట్లాడారంటే?

Gerald Ratner.. ఒక సమావేశంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంలో కొందరు అతనిని ఒక ప్రశ్న వేశారు. తాను అమ్మేది నిజమైన బంగారం కాదని.. ఒక స్క్రాప్ అని.. దీనిని జనాలు కొంటున్నారు.. అందుకే మేము అమ్ముతున్నాం.. అని చెప్పాడు. అయితే ఇతడు దీనిని సరదాగా చెప్పాడు. ఈ సరదా అతని పాలిట శాపంగా మారింది. ఈయన చేసిన వ్యాఖ్యలతో మరునాటి నుంచే.. అతని కంపెనీకి చెందిన ఆభరణాలను కొనుగోలు చేయడం ఆపేశారు. అంతేకాకుండా వాటిని కొనుగోలు చేస్తే చాలా నష్టపోతారు అని ప్రచారం జరిగింది. దీంతో ఒక్కసారిగా తన వేలకోట్ల సంపద ఆవిరైపోయింది. ఎంతో ఉన్నత స్థితిలో ఉన్న అతడు రోడ్డు మీద పడ్డాడు.

ఈ స్టోరీ నీతి ఏంటంటే?.. ఉన్నత స్థితిలో ఉన్నవారు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అందులోనూ వ్యాపారానికి సంబంధించిన విషయాలు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అనేది. కేవలం వ్యాపారులు మాత్రమే కాకుండా సాధారణ వ్యక్తుల సైతం ఎదుటివారితో మాట్లాడేటప్పుడు విలువైన మాటలను వృథా చేయకూడదు అని.. ఈ స్టోరీ నీతి తెలుపుతుంది.

[

Leave a Comment