Ramesh Babu success story: జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగాలని చాలామందికి ఉంటుంది. కానీ కొంతమంది మాత్రమే గమ్యాన్ని చేరుకుంటారు. ఈ ప్రయాణంలో ఎన్నో కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. వాటిని తట్టుకొని ముందుకు వెళ్లడమే ప్రతి ఒక్కరి వీధి. ఇందులో భాగంగా ఓ వ్యక్తి తన జీవితాన్ని పేపర్ వేయడం.. ఇంటింటికి పాలు అమ్మడం నుంచి ప్రారంభించాడు. ఆ తర్వాత తన తండ్రి చనిపోవడంతో సెలూన్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు. అయితే ఆ తర్వాత కొన్ని రోజులకు 400 లగ్జరీ కార్లను కొన్నాడు. ఇన్ని కార్లు కొనడానికి ఆయన చేసిన పని ఏంటి? ఇంతకీ ఆయన ఎవరు?
చిన్న స్థాయి నుంచి అత్యున్నత స్థాయికి ఎదిగే వారు ఎంతోమంది గురించి చదివే ఉంటారు. కానీ కర్ణాటక కు చెందిన రమేష్ బాబు జీవితం ప్రత్యేకమని చెప్పవచ్చు. బెంగళూరుకు చెందిన రమేష్ బాబు ఏమాత్రం ఆదాయం లేని కుటుంబంలో ఉండడంతో చిన్నప్పటి నుంచే పని చేయడం ప్రారంభించారు. ఒకవైపు చదువుకుంటూనే.. మరోవైపు పేపర్లు వేశారు. ఇంకోవైపు ఇంటింటికి తిరిగి పాలు పోశాడు. ఇలా తన జీవితాన్ని కొనసాగిస్తున్న సమయంలో అకస్మాత్తుగా తండ్రి మరణించాడు. దీంతో తన తల్లి ఇళ్లలో పనిచేసే కుటుంబాన్ని పోషించింది. అయితే 18 ఏళ్లు వచ్చిన తర్వాత రమేష్ బాబు తండ్రి పనిచేసిన సెలూన్ షాప్ లో బార్బర్గా జీవితాన్ని మొదలుపెట్టాడు. ఆ తర్వాత పలు షాపులను ప్రారంభించాడు.
కానీ రమేష్ బాబుకు వచ్చే ఆదాయం సంతృప్తి కాలేదు. దీంతో ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలని అనుకున్నాడు. ఈ క్రమంలో తన సొంత అవసరాలకు ఒక కారును కొనుగోలు చేశాడు. అయితే ఆ కారుకు ఈఎంఐ కట్టడానికి కూడా డబ్బులు లేని పక్షంలో.. దగ్గర బంధువులు ఇచ్చిన సలహాతో ఆ కారును అద్దెకు ఇచ్చాడు. ఇలా అద్దెకు ఇచ్చిన కారుతో రమేష్ బాబుకు అదృష్టం వరించింది. అలా ఆ తర్వాత ఒకటి వెంట ఒకటి మొత్తం 400 లగ్జరీ కార్లను కొనుగోలు చేశాడు. వీటన్నింటినీ రమేష్ బాబు అద్దెకు ఇస్తున్నాడు. ప్రస్తుతం ఆయన దగ్గర బీఎండబ్ల్యూ, ఆడి వంటి కార్లు ఉన్నాయి. కొన్నిటిని ఈయన వినియోగించుకుంటూ.. మరికొన్నింటిని రెంటుకు ఇస్తున్నారు.
సెలూన్ షాప్ లో తనకు వచ్చే ఆదాయం తోనే రమేష్ బాబు ఆగిపోతే.. ఈ స్టేజికి వచ్చే వారు కాదు. అంతేకాకుండా కృషి, పట్టుదలతో పాటు హార్డ్ వర్కింగ్ చేసిన రమేష్ కు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిచాయి. దీంతో ఇప్పుడు ఆయన అత్యున్నత స్థాయికి ఎదిగాడు. జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని అనుకునే వారు ఎవరైనా ఒకే పనితో ఆగిపోతే సంతృప్తి ఉండదు. అవకాశం ఉన్న ప్రతి రంగాల్లో ప్రయత్నాలు మొదలు పెడుతూ ఉండాలి. అప్పుడే అసలైన గెలుపు ఉంటుంది.
[