Railway Stations: ఒకే పట్టణంలో పక్క పక్కన రైల్వే స్టేషన్లు.. ఎక్కడో తెలుసా?

Railway Stations: ఏదైనా పట్టణాల్లో ఒకే ఒక రైల్వే స్టేషన్( railway station) ఉండడం సహజం. కానీ ఏపీలో ఒక పట్టణంలో మాత్రం రెండు రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఆ రెండు కూడా దాదాపు ఓ రెండు మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉంటాయి. ఏపీలోని పార్వతీపురం జిల్లా కేంద్రంలో ఇలా రెండు రైల్వేస్టేషన్లు ఉన్నాయి. విజయనగరం నుంచి రాయపూర్ మార్గంలో పార్వతీపురం రైల్వే స్టేషన్, బెలగాం రైల్వే స్టేషన్లు ఉంటాయి. ఈ రెండు రైల్వేస్టేషన్లో పక్కపక్కనే ఉండడం విశేషం. అయితే ఈ రెండు రైల్వేస్టేషన్లు ఇప్పుడు ప్రమాదంలో పడ్డాయి. ఒక రైల్వే స్టేషన్ ను మూసి వేసేందుకు రైల్వే శాఖ నిర్ణయించడం స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది.

కొత్తగా జిల్లా ఏర్పాటు..
మూడేళ్ల కిందట పార్వతీపురం మన్యం( parvatipuram manyam ) జిల్లా ఏర్పడింది. అయితే ఇక్కడ పార్వతీపురం రైల్వే స్టేషన్ కు సుదీర్ఘ చరిత్ర ఉంది. విజయనగరం నుంచి 79 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ పార్వతీపురం రైల్వే మార్గం 1908 లోనే ప్రారంభించబడింది. అయితే టౌన్ రైల్వే స్టేషన్గా పిలవబడే బెలగాం రైల్వే స్టేషన్ సైతం పార్వతీపురం పట్టణంలో కొనసాగుతోంది. అయితే ఈ మార్గంలో రైళ్ల రాకపోకలకు ఇబ్బంది దృష్ట్యా.. హాల్టింగుకు ఎంతగానో దోహదం చేస్తుంది బెల్గాం రైల్వే స్టేషన్. అటువంటి రైల్వే స్టేషన్ ను నిలిపి వేసేందుకు ప్రయత్నాలు జరుగుతుండడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో రెండు రైల్వేస్టేషన్లో కొనసాగించాలని కోరుతున్నారు.

ఈస్ట్ కోస్ట్ జోన్లో..
ఈ రైల్వే స్టేషన్లు రెండు ఈస్ట్ కోస్ట్ భువనేశ్వర్ రైల్వే జోన్( Bhubaneswar railway zone ) పరిధిలో ఉంటాయి. అయితే రెండు రైల్వే స్టేషన్లు ఉండడం వల్ల రైల్వే శాఖ పై భారం పడుతోందని.. అందుకే ఒక్కదానిని పార్వతీపురం రైల్వే స్టేషన్ లో విలీనం చేసి అభివృద్ధి చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. అయితే ఈ రెండు రైల్వే స్టేషన్లకు సుదీర్ఘ చరిత్ర ఉంది. దీంతో ఎట్టి పరిస్థితుల్లో బెలగాం రైల్వే స్టేషన్ ను నిలిపివేయుద్దని కోరుతూ పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర రైల్వే శాఖ అధికారులను విజ్ఞప్తి చేశారు. భువనేశ్వర్ లో జరిగిన రైల్వే జోనల్ కమిటీ సమావేశంలో రైల్వే శాఖ అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఆ రెండు రైల్వే స్టేషన్లను కొనసాగించాలని కోరారు. విజయనగరం- పార్వతీపురం మన్యం- ఒడిస్సా – చత్తీస్గడ్ రైల్వే మార్గాలను అనుసంధానించడంలో పార్వతీపురం రైల్వే స్టేషన్ కీలకపాత్ర పోషిస్తానని.. అందుకే దానిని కొనసాగించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. దీనిపై రైల్వే అధికారులు సానుకూలంగా స్పందించారు. చూడాలి మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో..

Leave a Comment