గోర్లు కొరకడం అనేది పిల్లలు, పెద్దలలో తరచుగా కనిపించే ఒక సాధారణ అలవాటు. ఈ అలవాటు మన ఆరోగ్యానికి హానికరం మాత్రమే కాదు జ్యోతిషశాస్త్రం ప్రకారం మన జీవితాలపై, గ్రహాలపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందట.
గోర్లు కొరకడం వల్ల శరీరంలో అనేక వ్యాధులు వస్తాయి. వివిధ రకాల బ్యాక్టీరియా, క్రిములు, దుమ్ము మన గోళ్ళలో, వేళ్ల చర్మంపై పేరుకుపోతాయి. గోర్లు కొరికినప్పుడు ఈ క్రిములు మన కడుపులోకి ప్రవేశిస్తాయి. దీనివల్ల కడుపు లోపాలు, ఇన్ఫెక్షన్లు, ఇతర వ్యాధులు వస్తాయి.
జ్యోతిషశాస్త్రం ప్రకారం గోర్లు కొరికే అలవాటు వ్యక్తుల జీవితాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. గోర్లు కొరికే వ్యక్తి సూర్య గ్రహం బలహీనంగా మారుతుందట. సూర్య గ్రహం విశ్వాసం, వృత్తికి విషయంలో కీలకంగా పరిగణింపబడుతుంది. సూర్యుడు బలహీనంగా ఉంటే ఆత్మవిశ్వాసం లోపిస్తుంది. వీరు కెరీర్లోనూ ఇబ్బందులను ఎదుర్కొంటారు. అంతేకాకుండా వీరిలో నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం తగ్గుతుంది.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గోర్లు కొరకడం శని దోషానికి సంకేతం. దీని అర్థం శని మీపై చెడు దృష్టి కలిగి ఉంటాడు. దీని వల్ల జీవితంలో అనేక సమస్యలు వస్తాయి. గోళ్లు కొరికే వ్యక్తులకు జీవితంలో డబ్బు కొరత ఏర్పడుతుంది. వీరు తరచుగా ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కోవలసి ఉంటుంది. అందుకే ఈ అలవాటును వెంటనే మానేయడం మంచిది.
గోళ్ళు కొరికే అలవాటు ఉన్నవారు, వాటిని కొరకాలనే కోరిక కలగకుండా ఉండేందుకు క్రమం తప్పకుండా కత్తిరించుకుంటూ ఉండాలి. మార్కెట్లో ఒక ప్రత్యేకమైన నెయిల్ పాలిష్ అందుబాటులో ఉంది.ఇది చేదుగా ఉంటుంది. దీన్ని పూయడం వల్ల గోళ్ళు కొరకాలనే కోరిక తగ్గుతుంది. సాధారణఃగా ఒత్తిడికి గురైనప్పుడు, ఆందోళన చెందినప్పుడు గోళ్లు కొరుకడం జరుగుతుంది. కాబట్టి యోగా, ధ్యానం వంటివి చేయడానికి ప్రయత్నించాలి. మీ గోళ్లు కొరుకుకోవాలనే కోరిక కలిగినప్పుడు మీ చేతులను బిజీగా ఉంచడానికి బాల్ పాయింట్ పెన్ను లేదా మరేదైనా వస్తువు చేతిలోకి తీసుకోండి.
[