Nagarjuna University Baboons: వాట్ ఏ ఐడియా.. నాగార్జున యూనివర్సిటీ కి ‘కొండముచ్చు’ భద్రత!

Nagarjuna University Baboons: అడవులు నరికివేతకు గురవుతున్నాయి. వన్యప్రాణులు బాహ్య ప్రపంచంలోకి వస్తున్నాయి. ఇప్పుడు ప్రతిచోట ఇవన్నీ ప్రాణుల తాకిడి ఎదురైంది. ముఖ్యంగా కోతుల( monkeys ) బెడద అధికంగా ఉంది. అయితే అక్కడా ఇక్కడా అన్న తేడా లేకుండా అన్నిచోట్ల ఇదే పరిస్థితి ఉంది. ఆ జాబితాలోకి గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం చేరింది. చాలా రోజులుగా యూనివర్సిటీకి కోర్టుల బెడద అధికంగా ఉండేది. అక్కడ ఉండే విద్యార్థులతో పాటు అధ్యాపకులు, సిబ్బంది తీవ్ర అసౌకర్యానికి గురయ్యేవారు. దీంతో అక్కడ పనిచేస్తున్న దేవయ్యకు ఒక వింత ఆలోచన వచ్చింది. కోతులకు విరుగుడుగా కొండముచ్చుని తెచ్చారు. ఆ కొండముచ్చుతో యూనివర్సిటీకి కోతుల బెడద నుంచి తప్పించారు. అయితే ఇది ఏడాదో.. రెండేళ్లు కాదు. గత 23 సంవత్సరాలుగా యూనివర్సిటీకి కొండముచ్చు రక్షణగా నిలుస్తోంది.

Also Read: ‘సింగర్ ఆఫ్ ది ప్యారడైజ్’ ఫుల్ మూవీ రివ్యూ…హిట్టా? ఫట్టా?

* కోతులకు విరుగుడుగా
నాగార్జున యూనివర్సిటీ( Nagarjuna University) ప్రాంగణంలో చెట్లు ఎక్కువ. ఈ తరుణంలో కోతులు ఎక్కువగా సంచరించడం ప్రారంభించాయి. 2002లో యూనివర్సిటీ ప్రాంగణంలోని క్లాస్ రూములు, హాస్టళ్లు, చివరకు క్యాంటీన్లలో సైతం వందల సంఖ్యలో కోతులు వచ్చి బెంబేలెత్తించేవి. విద్యార్థులు భోజనం చేసే సమయంలో సామూహికంగా దాడి చేసేవి. ఆహారాన్ని వృధా చేసేవి. దీంతో యూనివర్సిటీలో చేరేందుకు విద్యార్థులు భయపడే పరిస్థితికి దారితీసింది. ఈ క్రమంలోనే అక్కడ పనిచేస్తున్న దేవయ్య కోతులను బెదరగొట్టే పనిలోపడ్డాడు. కొండముచ్చును మజ్జిగ చేసుకుని యూనివర్సిటీలో తిరగడం ప్రారంభించాడు. అప్పటినుంచి ఇప్పటివరకు ప్రతిరోజు.. ఉదయం, మధ్యాహ్నం సమయంలో దేవయ్య కొండముచ్చును సైకిల్ పై ఎక్కించుకొని యూనివర్సిటీ అంతా తిరుగుతూ కోతులను తరిమికొడుతుంటాడు. అయితే ఈ 23 సంవత్సరాల లో మూడు కొండముచ్చులను పెంచాడు దేవయ్య. ఇప్పటికే రెండు కొండముచ్చులు చనిపోగా.. ఇప్పుడు ఉన్నది మూడోది.

* సహజ సిద్ధ వైరం.
కొండముచ్చు, కోతిమధ్య సహజసిద్ధమైన వైరం ఉంది. కొండముచ్చులు కోతులు కంటే పెద్దవిగా ఉంటాయి. భయంకరంగా కనిపిస్తాయి. అందుకే కొండముచ్చులు అంటే కోతులకు భయం. అందుకే కోతుల బాధిత గ్రామాల్లో కొండముచ్చులు ఎక్కువగా తెచ్చి పెంచుతుంటారు. అందుకే ఇప్పుడు కొండముచ్చులకు విపరీతమైన గిరాకీ. కోతుల నియంత్రణకు కొండముచ్చులను రంగంలోకి దించి.. బాగానే కట్టడి చేస్తుంటారు. అయితే ఇప్పుడు నాగార్జున యూనివర్సిటీలో కొండముచ్చును సెక్యూరిటీ వింగ్ గా చూస్తుంటారు అక్కడివారు. ఆ కొండముచ్చును విద్యార్థులు సైతం ఇష్టపడుతుంటారు. తమ వెంట తెచ్చుకున్న ఆహార పదార్థాలను ఇస్తుంటారు.

Leave a Comment