Life Lessons: మిమ్మల్ని కిందకు లాగాలనుకునే వారికి మీరిచ్చే సమాధానం ఇదీ

Life Lessons: మౌనంగానే ఎదగమని.. ఎదగిన కొద్దీ ఒదగమని.. అన్న సాంగ్ ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిన విషయమే. ఈ పాట కేవలం వినడానికి కాకుండా ఎంతోమంది జీవితాలను గాడిలో పెట్టేందుకు రచించినట్లు తెలుస్తోంది. నిజజీవితంలో కూడా చాలామంది ఎంతో ఎత్తుకు ఎదగాలని అనుకుంటారు. కానీ ఈ సమాజంలో కొందరు ఓర్వలేని వారు ఉన్నారు. ఒక వ్యక్తి ఎదుగుతున్నాడు అంటే అతనికి ఎలాంటి అడ్డంకులు సృష్టించాలి? అని ఆలోచించే వారే ఎక్కువగా ఉన్నారు. అయితే ఒక వ్యక్తి గమ్యాన్ని చేరాలంటే అడ్డువచ్చే వాటిని తట్టుకొని ముందుకు వెళ్లాలంటే కొన్ని పనులు చేయాలి. వాటిని చేయడం ద్వారా ఎవరైతే కిందకి లాగాలని అనుకుంటున్నారో.. వారికి ఇదే సరైన సమాధానం అవుతుంది. మరి అది ఏంటంటే?

మనం అడవిలో నుంచి కొంత దూరం ప్రయాణం చేయాలని అనుకుంటాం. కానీ మధ్యలో ఎన్నో మృగాలు వస్తూ ఉంటాయి. అడవిలో నుంచి వెళ్తామనే విషయం ముందే తెలుసు.. అలాగే మధ్యలో జంతువులు అడ్డు వస్తాయన్న విషయం కూడా తెలుసు.. అందుకే ముందే ప్లాన్ కొద్దీ వాటి నుంచి తప్పించుకోవడానికి రక్షణ చర్యలు ఏర్పాటు చేసుకోవాలి. అలా చేసుకోకుండా గుడ్డిగా ముందుకు వెళితే వాటి దాటికి మధ్యలోనే అంతమైపోయే అవకాశం ఉంటుంది.

అలాగే ఒక గద్ద పైకి ఎగురుతూ ఉంటుంది. ఇదే సమయంలో గడ్డ పై దాడి చేసేందుకు కాకి ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగా కాకి కథ పై ఎక్కి కూర్చుంటుంది. గత తలపై పొడుస్తూ గద్ద ను చంపేయాలని చూస్తూ ఉంటుంది. అయితే గద్ద ఆ కాకిపై దాడి చేయదు. అది ఇంకా పైకి ఎగురుతూ ఉంటుంది. అలా పైకి ఎగరడం వల్ల గద్ద బాగానే ఉంటుంది. కానీ కాకికి శ్వాస ఆడక కింద పడిపోతుంది. అంటే గద్ద ఏమాత్రం కష్టపడకుండా చిన్న ఆలోచనతో కాకిని దూరం చేసుకుంది.

అలాగే ఒక లక్ష్యాన్ని చేరుతున్న వ్యక్తికి కొందరు అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వారిని కిందికి లాగాలని కుట్రలు పన్నుతూ ఉంటారు. అలాంటి వారికి నేరుగా స్పందించకుండా.. వారిని పట్టించుకోకుండా ముందుకు వెళ్లాలి. ఇదే సమయంలో వారిని ఆలోచనలతో దూరం చేసుకోవాలి. ఒక పనిని పూర్తి చేసేదాకా మౌనంగా ముందుకు వెళ్లడమే సరైన మార్గం. ఇలా లక్ష్యం చేరే దాకా సైలెన్స్ గా ఉన్నవారికి అడ్డంకులు సృష్టించే వారే భయపడి పోతారు. దీంతో వారి వ్యూహం ఏంటో అర్థం కాక అడ్డంకులు సృష్టించే ప్రయత్నం మానుకుంటారు. ఇలా చిన్న చిన్న విషయాలను పట్టించుకోకుండా ముందుకు వెళ్లేవారు.. కచ్చితంగా విజయం సాధిస్తారు. అలా కాకుండా ప్రతి విషయానికి స్పందించడం వల్ల.. సమయం అక్కడే వృథా అవుతుంది. నీతో లక్ష్యం చేరడానికి సరైన సమయం, శక్తి ఉండదు.

[

Leave a Comment