Jagan vs Chandrababu: జగన్ ఫ్లోటింగ్ బ్రిడ్జి వర్సెస్ చంద్రబాబు డబుల్ డెక్కర్ బస్సులు!

Jagan vs Chandrababu: రాజకీయాల్లో ప్రభుత్వాల పని తీరుపై రకరకాలుగా చర్చ నడుస్తుంటుంది. పాలకుల తీరు, విధానాలపై కూడా ప్రజలు చర్చించుకుంటారు. నేతల సమర్థతపై మాట్లాడుతుంటారు. ఇప్పుడు ఏపీలో అటువంటి చర్చ ఒకటి నడుస్తోంది. విశాఖలో పర్యాటకుల కోసం డబుల్ డెక్కర్ బస్సులను ఏర్పాటు చేసింది ఏపీ పర్యాటక శాఖ. ఈరోజే ఆ బస్సులను ప్రారంభించారు ఏపీ సీఎం చంద్రబాబు. విశాఖ నగరంలో పర్యాటకుల కోసం ప్రత్యేకంగా తిరిగే ఈ డబుల్ డెక్కర్ బస్సుల్లో.. 24 గంటల ప్రయాణానికి కేవలం 250 రూపాయల టికెట్ నిర్ధారించారు. అయితే రోజంతా ఈ డబుల్ డెక్కర్ లో ప్రయాణానికి తొలుత 500 రూపాయలుగా పర్యాటకశాఖ టికెట్ ధరగా నిర్ణయించింది. కానీ చంద్రబాబు ప్రారంభోత్సవం చేసిన అనంతరం.. దానిని సగానికి తగ్గించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. మిగతా 250 రూపాయల టికెట్ ధరను ప్రభుత్వ భరిస్తుందని.. పర్యాటకులకు రాయితీ కింద అందిస్తామని ప్రకటన చేశారు. ఇదే సమయంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యాటక విధానం ఒకటి ఎక్కువమంది గుర్తు చేస్తున్నారు.

రెండు రోజులకే ముక్కలు..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో విశాఖ బీచ్ లో పర్యాటక అభివృద్ధికి సంబంధించిన ఏర్పాట్లు జరిగాయి. ఆర్కే బీచ్ లో సుమారు నాలుగు కోట్ల రూపాయల ఖర్చుతో.. సముద్రపు అలలపై తెలియాడే చిన్న ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయించారు. అది తీరం నుంచి సుమారు 100 నుంచి 200 అడుగుల సముద్రంలో నీళ్లపై తెలియాడుతూ ఉంటుంది. అయితే అది మూన్నాళ్ళ ముచ్చటగానే మిగిలింది. ఏర్పాటు చేసిన రెండు రోజులకే ముక్కలు ముక్కలుగా మారింది. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాన్ని బయటపెట్టింది. కేరళ తీరంలో ఉండే ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ను ఏపీకి పరిచయం చేశారు జగన్. కానీ కేరళలో అలల తాకిడి తక్కువగా ఉంటుంది. అక్కడైతే సరిపోతుంది కానీ విశాఖలో.. అలలు ప్రమాదకరంగా ఉంటాయి. ఓవైపు ఇక్కడి అలలు ప్రమాదకరం అని బోర్డులు ఉండగా.. దాని చెంతనే ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జి అప్పట్లో ఏర్పాటు చేయడం కూడా విమర్శలకు తావిచ్చింది. అప్పట్లో ఫ్లోటింగ్ బ్రిడ్జికి ప్రభుత్వం కేటాయించిన నిధులు నీటి పాలయ్యాయి.

డబుల్ డెక్కర్ కు విశేష ఆదరణ
అయితే తాజాగా విశాఖలో పర్యాటక ప్రాంతాలన్నీ కలుపుతూ ఈ డబుల్ డెక్కర్ బస్సులను ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం. విశాఖ ఆర్కే బీచ్ నుంచి భీమిలి బీచ్ వరకు వ్యాపించి ఉంది. దారి పొడవునా ఎన్నెన్నో బీచ్ పార్కులు, వ్యూ పాయింట్స్ ఎన్నో ఉన్నాయి. వాటన్నింటినీ సందర్శించడానికి వీలుగా సీఎం చంద్రబాబు సూచనల మేరకు పర్యాటకశాఖ డబుల్ డెక్కర్ బస్సులను ఏర్పాటు చేసింది. వీటికి వచ్చే ఆదరణబట్టి మరిన్ని బస్సులు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. విశాఖ ప్రజలతోపాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులకు.. ఈ డబ్బులు డెక్కర్ బస్సుల్లో బీచ్ పార్కులు చూసేందుకు అవకాశం కలుగుతుంది. జగన్ నాలుగు కోట్ల రూపాయలతో ఫ్లోటింగ్ బ్రిడ్జి ఏర్పాటు చేయగా.. రెండు రోజులకే ముక్కలయింది. కానీ చంద్రబాబు అదే నాలుగు కోట్ల రూపాయలతో రెండు డబుల్ డెక్కర్ బస్సులను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టారు. తొలి రోజే దీనికి విశేష ఆదరణ లభించింది. అందుకే ఇప్పుడు జగన్ విధానం వర్సెస్ చంద్రబాబు విధానం అన్నట్టు పోటీ నడుస్తోంది. తప్పకుండా డబ్బులు డెక్కర్ వైపే అందరూ మొగ్గు చూపుతారు కూడా. ఎందుకంటే ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఏర్పాటు చేసిన రెండు రోజులకే అది ముక్కలైంది కనుక..

Leave a Comment