Hop On Hop Off Buses: రూ.250తో 24 గంటల ప్రయాణం.. విశాఖ వాసులకు చంద్రబాబు గుడ్ న్యూస్!

Hop On Hop Off Buses: విశాఖను( Visakhapatnam) పర్యాటకంగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. ఇప్పటికే అక్కడ పర్యాటక స్థలాలు ఎన్నో ఉన్నాయి. పెద్ద ఎత్తున విశాఖకు పర్యాటకులు వస్తుంటారు. దీంతో వారికి మరింతగా సౌలభ్యత కల్పించేందుకు ఏపీ ప్రభుత్వం నడుం బిగించింది. డబుల్ డెక్కర్ బస్సులను అందుబాటులోకి తెచ్చింది. హాప్ ఆన్ హాప్ ఆఫ్ బస్సుల పేరిట రెండు డబుల్ డెక్కర్ బస్సులు ఏర్పాటు చేయగా.. వాటిని ఈరోజు సీఎం చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం ప్రజాప్రతినిధులతో కలిసి ఆ బస్సులోనే ప్రయాణించారు. ఆర్కే బీచ్ నుంచి తొట్లకొండ వరకు 16 కిలోమీటర్ల మేర పర్యాటక ప్రాంతాల్లో ఈ ప్రత్యేక బస్సులు తిరుగుతాయి. ప్రారంభోత్సవం సందర్భంగా ఈ ఎలక్ట్రికల్ డబుల్ డెక్కర్ బస్సుల్లో స్వయంగా సీఎం చంద్రబాబు కొంత దూరం ప్రయాణించారు.

పర్యాటకుల కోసం ప్రత్యేకంగా..
ప్రత్యేకంగా పర్యాటకుల కోసమే ఈ డబ్బులు డెక్కర్ బస్సులను( double decker buses ) అందుబాటులోకి తెచ్చారు. 24 గంటలపాటు ఒకే టికెట్టు ప్రయాణించే సౌలభ్యత కల్పించారు టికెట్ చార్జీ 500 రూపాయలుగా నిర్ణయించారు. అయితే అందులో సగం మొత్తాన్ని ప్రభుత్వమే భరించనుంది. కేవలం 250 రూపాయలకే 24 గంటలపాటు ఈ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయవచ్చు అన్నమాట. నిజంగా ఇది పర్యాటకులకు ఒక వరమే. ఇప్పటికే పర్యాటక రంగంలో విప్లవాత్మక మార్పులకు ప్రయత్నిస్తోంది కూటమి ప్రభుత్వం. అందులో భాగంగా విశాఖ నగరాన్ని మరింతగా అభివృద్ధి చేయాలని సంకల్పించింది.

ఎనలేని ప్రాధాన్యం..
విశాఖకు ఎనలేని ప్రాధాన్యం ఇస్తున్నట్లు సీఎం చంద్రబాబు( CM Chandrababu) ఈ సందర్భంగా అన్నారు. విశాఖను ఐటి హబ్ గా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. విశాఖకు ఇప్పటికే టిసిఎస్ వంటి దిగ్గజ సంస్థ వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. త్వరలో ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ గూగుల్ రానుందని ప్రకటించారు. ఈ డేటా సెంటర్ ఏర్పాటు ద్వారా విశాఖ ప్రపంచంతో అనుసంధానం అవుతుందని చెప్పుకొచ్చారు. ఇండియాలోనే టెక్నాలజీ హబ్ గా విశాఖ ఎదుగుతుందని కూడా అభిప్రాయపడ్డారు ఏపీ సీఎం చంద్రబాబు.

మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరు
మరోవైపు విశాఖలోనే ఉన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( deputy CM Pawan Kalyan). గత మూడు రోజులుగా జనసేన విస్తృతస్థాయి సమావేశాలకు హాజరయ్యారు. ఇంకోవైపు నారా లోకేష్ సైతం రెండు రోజుల పర్యటనకు విశాఖకు వచ్చారు. కానీ ఆ ఇద్దరు నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు. కానీ పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న కందుల దుర్గేష్, హోంమంత్రి వంగలపూడి అనిత, టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, ఎంపీ శ్రీ భరత్ తో పాటు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. అయితే రోజంతా విశాఖ నగరంలో ప్రయాణానికి వీలుగా.. ఈ డబ్బులు డెక్కర్ బస్సు అందుబాటులోకి రావడం పై పర్యాటకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Comment