Hemoglobin Deficiency Vs Periods: అమ్మాయిలు వింటున్నారా..? రక్తంలో హిమోగ్లోబిన్ తక్కువైనా ఆ సమస్యలు తప్పవట..

Hemoglobin Deficiency Vs Periods: అమ్మాయిలు వింటున్నారా..? రక్తంలో హిమోగ్లోబిన్ తక్కువైనా ఆ సమస్యలు తప్పవట..

శరీరంలో హిమోగ్లోబిన్ లేకపోవడం అనేది.. ఐరన్‌ లోపం వల్ల కలిగే రక్తహీనత వల్ల వస్తుంది. ఇది అమ్మాయిల ఋతు చక్రాలను కూడా ప్రభావితం చేస్తుంది. దీనివల్ల అమ్మాయిలకు ఋతుచక్రాలు సక్రమంగా రావు. ఒక్కోసారి పూర్తిగా ఆగిపోతాయి కూడా. శరీరం అంతటా, పునరుత్పత్తి అవయవాలకు ఆక్సిజన్‌ను తీసుకువెళ్ళే హిమోగ్లోబిన్ ఉత్పత్తికి ఐరన్‌ చాలా అవసరం. అందువల్ల కాలక్రమేణా, మహిళల్లో హిమోగ్లోబిన్ లోపం వల్ల రక్తంలో తగినంత ఆక్సిజన్ అందదు. ఇది పీరియడ్స్ సమయంలో రక్త ప్రవాహాన్ని ప్రభావితం చేస్తుంది. దీనివల్ల క్రమరహిత పీరియడ్స్ వస్తాయి.

హిమోగ్లోబిన్ లోపానికి కారణాలు

గైనకాలజిస్టుల ప్రకారం.. మహిళల శరీరంలో హిమోగ్లోబిన్ లోపానికి కారణాలలో ఐరన్, ఫోలేట్ వంటి అనేక రకాల విటమిన్లు, ముఖ్యమైన పోషకాల లోపం ఒకటి. రక్తంలో హిమోగ్లోబిన్ లోపం అనేది ఏదైనా అనారోగ్యం కారణంగా శరీరంలో రక్తం లేకపోవడం వల్ల వస్తుంది. ముఖ్యంగా అధిక రుతుస్రావం ఉన్న స్త్రీలలో కూడా హిమోగ్లోబిన్ లోపం ఉంటుంది. గర్భధారణ, తల్లిపాలు ఇవ్వడం, వేగంగా బరువు పెరగడం వంటి శరీరంలోని మార్పులు కూడా హిమోగ్లోబిన్ లోపానికి కారణమవుతాయి. తలసేమియా వంటి వ్యాధులతో బాధపడేవారిలో తక్కువ హిమోగ్లోబిన్ ఉండటం సాధారణం. మహిళల శరీరంలో ఐరన్ లోపం కూడా తక్కువ హిమోగ్లోబిన్‌కు ప్రధాన కారణం. కీమోథెరపీ, రక్తం పలుచబడే మందుల వల్ల కూడా హిమోగ్లోబిన్ స్థాయిలు తగ్గుతాయి.

హిమోగ్లోబిన్ లోపాన్ని ఎలా అధిగమించాలి?

శరీరంలో హిమోగ్లోబిన్ తక్కువగా ఉండటానికి అతిపెద్ద కారణం ఐరన్‌ లోపం. కాబట్టి మీ ఆహారంలో ఐరన్‌ అధికంగా అందించే వాటిని చేర్చుకోవాలి. టోఫు, ఖర్జూరాలు, బ్రోకలీ, గ్రీన్ బీన్స్, డ్రై ఫ్రూట్స్, గింజలు మొదలైన వాటిని మీ ఆహారంలో చేర్చుకోవాలి. ఐరన్‌ శోషణలో విటమిన్ సి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కాబట్టి విటమిన్ సి అధికంగా ఉండే నారింజ, నిమ్మకాయలు, కివి, బొప్పాయి, క్యాప్సికమ్‌ను ఆహారంలో చేర్చుకోవాలి. హిమోగ్లోబిన్ ఉత్పత్తికి ఫోలేట్ ఒక ముఖ్యమైన పోషకం. అందువల్ల ఆహారంలో ఆకుకూరలు, వేరుశెనగలు, బియ్యం, కిడ్నీ బీన్స్, అవకాడో, అరటిపండ్లు, బ్రోకలీని చేర్చుకోవచ్చు. అన్నింటికంటే ముఖ్యంగాశరీరంలో హిమోగ్లోబిన్ స్థాయి చాలా తక్కువగా ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. హిమోగ్లోబిన్ పెంచడానికి ఐరన్ సప్లిమెంట్లను కూడా తీసుకోవచ్చు.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.

[

Leave a Comment