Health Tips: ఫోన్‌కు నిద్రకు సంబంధమేంటీ..? ఆరోగ్యాన్ని ఎలా నాశనం చేస్తుంది?

Health Tips: ఫోన్‌కు నిద్రకు సంబంధమేంటీ..? ఆరోగ్యాన్ని ఎలా నాశనం చేస్తుంది?

నేటి ఇంటర్నెట్ యుగంలో స్మార్ట్‌ఫోన్ యూజ్ చేయని వారు ఉండడం చాలా తక్కువ. మనిషి జీవితంలో ఇది ఒక ముఖ్య భాగంగా మారింది. ఉదయం నిద్ర లేచిన నుంచి రాత్రి నిద్ర పోయే వరకు ఫోన్‌ లేకుండా అరగంట ఉండలేకపోతున్నారు. ఈ వ్యసనం వల్ల నిద్ర చక్రం దెబ్బతిని, అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తోంది. పిల్లలే కాదు యువకులు కూడా స్మార్ట్‌ఫోన్ వ్యసనం బారిన పడుతున్నారు.

మెదడుపై ప్రభావం

స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ నుండి వెలువడే బ్లూ లైట్ మన మెదడుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ఇది మెలటోనిన్ అనే హార్మోన్‌ ఉత్పత్తిని తగ్గిస్తుంది. ఈ హార్మోన్ నిద్రకు కీలకమైనది. మెలటోనిన్ సరిగ్గా ఉత్పత్తి కాకపోవడం వల్ల నిద్రపట్టడం కష్టమవుతుంది. రాత్రి వరకు మొబైల్ వాడేవారికి నిద్ర సమస్యలు రావడానికి ఇది ప్రధాన కారణం.

నిద్ర చక్రం దెబ్బతినడం

రాత్రి పడుకునే ముందు ఫోన్ వాడటం వల్ల సమయం తెలియకుండా గంటలు గంటలు గడిచిపోతాయి. దీంతో నిద్రపోయే సమయం తప్పిపోతుంది. రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం వల్ల నిద్ర చక్రం దెబ్బతింటుంది. తగినంత నిద్ర లేకపోవడం వల్ల ఏకాగ్రత, పనితీరు తగ్గిపోతాయి. ఇది రోజువారీ జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

నిద్రలేమి వల్ల వచ్చే సమస్యలు

సరిగ్గా నిద్ర లేకపోతే ఏకాగ్రత తగ్గుతుంది.

చిరాకు, చెడు మానసిక స్థితి, పని చేసే సామర్థ్యం తగ్గుతాయి.

నిద్రలేమి వల్ల అధిక రక్తపోటు, మధుమేహం వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

రాత్రి ఆలస్యంగా మేల్కొనడం వల్ల అనారోగ్యకరమైన ఆహారాలు తినే అవకాశం ఉంది. ఇది ఊబకాయానికి దారితీస్తుంది.

దీర్ఘకాలిక నిద్రలేమి డిప్రెషన్ వంటి తీవ్రమైన మానసిక సమస్యలకు దారితీయవచ్చు.

ఫోన్ వ్యసనాన్ని తగ్గించే చిట్కాలు:

అనవసరమైన స్క్రోలింగ్‌ను మానుకోండి

నిద్రపోవడానికి కనీసం ఒక గంట ముందు ఫోన్‌ను పక్కన పెట్టండి.

అలారం కోసం డిజిటల్ గడియారాన్ని ఉపయోగించండి. ఫోన్‌ను బెడ్‌రూమ్‌లో ఉంచుకోకండి.

రోజంతా ఫోన్ వాడకానికి ఒక నిర్దిష్ట సమయం కేటాయించండి.

నిద్రపోయే ముందు పుస్తకం చదవడం లేదా ధ్యానం చేయడం వంటి అలవాట్లను చేసుకోండి.

ఈ చిన్న మార్పులు చేయడం ద్వారా స్మార్ట్‌ఫోన్ వ్యసనం నుండి బయటపడి, మెరుగైన నిద్రను పొందవచ్చు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

[

Leave a Comment