శుక్రవారం రాత్రి అరుణ్ జైట్లీ స్టేడియంలో సౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్జ్, వెస్ట్ ఢిల్లీ లయన్స్ మధ్య జరిగిన ఢిల్లీ ప్రీమియర్ లీగ్ 2025 ఎలిమినేటర్ మ్యాచ్‌లో పెద్ద గొడవ జరిగింది. ఇరు జట్లకు చెందిన ఇద్దరు ఆటగాళ్లు ఒకరిపైకి ఒకరు దూసుకెళ్లారు. 11వ ఓవర్‌లో 202 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వెస్ట్ ఢిల్లీ లయన్స్ ఓపెనర్ క్రిష్ యాదవ్ అమన్ భారతి బౌలింగ్‌లో అవుట్ అయిన తర్వాత ఈ రచ్చ జరిగింది. 11వ ఓవర్ తొలి బంతికి పేసర్ భారతిని లాంగ్-ఆఫ్ కోసం సిక్స్ కొట్టడానికి క్రిష్ ప్రయత్నించాడు. అయితే సరిగ్గా టైమ్ కాకపోవడంతో బౌండరీ రోప్ దగ్గర అన్మోల్ శర్మ చేతిలో క్యాచ్ అవుట్ అయ్యాడు. ఆ సమయంలోనే రెండు వైపుల ఆటగాళ్లు ఒకరినొకరు తోసుకుంటూ తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. సౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్జ్ తరఫున కీలకమైన వికెట్ తీసుకున్న ఈ పేసర్.. అవుటైన బ్యాటర్ వైపు చూస్తూ ఏదో అన్నాడు.. దాంతో క్రిష్ యాదవ్ వికెట్ దగ్గరకు తిరిగి వచ్చి కొన్ని మాటలతో ఎదురుదాడికి దిగాడు.
DPL eliminator match🔥🔥🌋🌋#DPLT20 pic.twitter.com/0ag54kzNrP
— Aaditya jha (@aadi___45) August 29, 2025
సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్స్ కు చెందిన సుమిత్ మాథుర్ క్రిష్ వైపు దూసుకుపోతూ వేలు చూపిస్తూ ఏదో అన్నాడు. పరిస్థితి చాలా తీవ్రంగా మారడంతో వెస్ట్ ఢిల్లీ లయన్స్ కెప్టెన్ నితీష్ రాణా ఆన్-ఫీల్డ్ అంపైర్లతో కలిసి జోక్యం చేసుకుని సుమిత్, క్రిష్ లను విడదీయాల్సి వచ్చింది. లేడీ అంపైర్ క్రిష్‌ను ఫీల్డ్ నుంచి వెళ్లిపోవాలని కోరగా, నితీష్ రాణా సుమిత్ భుజం చుట్టూ చేయి వేసి వెనక్కి తీసుకెళ్లడంతో గొడవ సద్దమణిగింది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన వెస్ట్ ఢిల్లీ లయన్స్ జట్టు క్వాలిఫయర్ 2కు చేరుకుంది. నితీష్ రాణా నేతృత్వంలోని జట్టు 202 పరుగుల లక్ష్యాన్ని ఇంకా 17 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. కెప్టెన్ 55 బంతుల్లో 8 ఫోర్లు, 15 సిక్సర్లతో అజేయంగా 134 పరుగులు చేయడంతో ఈ విజయం సాధ్యమైంది. ఎడమచేతి వాటం రాణా 243.64 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేశాడు, కీలకమైన నాకౌట్ గేమ్‌కు తన అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాడు. అంతకుముందు కెప్టెన్ మరియు వికెట్ కీపర్-బ్యాటర్ తేజస్వి దహియా 60 పరుగులతో చెలరేగడంతో సౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్జ్ నిర్ణీత ఇరవై ఓవర్లలో 201/5 పరుగులు చేసింది. ఆగస్టు 30 శనివారం అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగే క్వాలిఫయర్ 2లో వెస్ట్ ఢిల్లీ లయన్స్ ఈస్ట్ ఢిల్లీ రైడర్స్‌తో తలపడనుంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి