జమ్మూ కాశ్మీర్‌లో వర్షం బీభత్సం సృష్టించింది. ఇప్పుడు మరోసారి రాంబన్‌లోని రాజ్‌గఢ్ ప్రాంతంలో (భారీ వర్షాలు కురవడమే క్లౌడ్ బరస్ట్ లేదా మేఘాల విస్ఫోటం) క్లౌడ్ బరస్ట్ జరిగిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. చాలా మంది తప్పిపోయినట్లు సమాచారం. దీనితో పాటు భారీ వర్షాల కారణంగా సంభవించిన ఆకస్మిక వరదలో అనేక ఇళ్ళు నేలమట్టమయ్యాయి. కొన్ని ఇళ్ళు వరద నీటిలో పూర్తిగా కొట్టుకుపోయాయి. ఈ సంఘటన తర్వాత ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి.
అయితే స్థానిక యంత్రాంగం సంఘటన స్థలంలో సహాయక చర్యలు ప్రారంభించింది. రెస్క్యూ బృందాలు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని ప్రజలను వెతకడం ప్రారంభించాయి. సంఘటన స్థలంలో నిరంతర సహాయక చర్యలు చేపట్టారు. బాధిత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రజల కోసం సహాయ శిబిరాలను ఏర్పాటు చేసి, వారిని అక్కడికి తరలిస్తున్నారు. దీనితో పాటు పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని అధికారులు తెలిపారు.
ఇప్పటివరకు చాలా మంది ప్రాణాలు కోల్పోయారు
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, మేఘ విస్పోటనం కారణంగా నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయని, వాటి నీటి మట్టం వేగంగా పెరుగుతోందని స్థానిక యంత్రాంగం తెలిపింది. ఈ పరిస్థితిలో, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేసింది. ఈ ఏడాది జమ్మూలోని వివిధ ప్రాంతాలలో కురిసిన భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటం, మేఘ విస్పోటనం వలన చాలా మంది ప్రాణాలు కోల్పోయారని, గల్లంతయ్యారని కూడా స్థానిక యంత్రాంగం తెలిపింది.
ఇవి కూడా చదవండి
జమ్మూ కాశ్మీర్‌లో ఆకాశం నుంచి కురిసిన ఈ విపత్తు అనేక మంది జీవితాలను తుడిచిపెట్టింది. చాలా మంది ప్రజలు వారి కుటుంబాలతో సహా వరదల్లో చిక్కుకున్నారు. మరికొందరి ఇళ్ళు వరదల్లో కొట్టుకుపోయాయి. వర్ఈషాలు, వరదల కారణంగా గత వారం జమ్మూ, సాంబా, కథువా, రియాసి, దోడాలో సంభవించిన వరదల్లో 36 మందికి పైగా మరణించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..